ఈ బిజి షెడ్యూల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. నిద్రపోవడం ద్వారా అనేక రకాల వ్యాధులను నియంత్రించవచ్చు. నిద్ర తక్కువగా ఉండటం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
గుండె జబ్బులు: మన శరీరానికి సుమారు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం. ఒకవేళ మీరు అంతకన్నా తక్కువ నిద్రపోతే దీర్ఘకాలికంగా మీరు ఇలా చేసినట్లయితే మీకు గుండె జబ్బులు సమస్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. క్రమం తప్పకుండా మీరు ప్రతి రోజు 8 గంటల నిద్రపోయినట్లయితే మీకు ఈ గుండె జబ్బుల సమస్య నుండి బయటపడతారు.
బీపీని పెంచుతుంది: నిద్ర తక్కువ పోయే వారిలో బీపీ సమస్య పెరుగుతుంది. ఇది వీరి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. నిద్రలేమి వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు కూడా కారణం అవుతుంది. కాబట్టి మీరు ప్రతిరోజు తగినంత నిద్రపోయినప్పుడు మీ రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీని ద్వారా మీ గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
Health Tips: ఇర్ రెగ్యులర్ పిరియడ్స్ తో బాధపడుతున్నారా
గుండె దడ: నిద్రలేమి వల్ల గుండె కొట్టుకోవడం కూడా సక్రమంగా ఉండదు. తగినంత నిద్ర లేనప్పుడు మీ హృదయ స్పందనలు మారుతాయి. దీని ద్వారా మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. మీరు తగినంత నిద్రపోతే గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించి ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
ఒత్తిడి: నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి కూడా పెరుగుతుంది. దీని ద్వారా మీరు గ్యాస్ ప్రాబ్లం, కడుపునొప్పి ,సమస్యలతో బాధపడతారు. జీర్ణ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఏర్పడతాయి.
డయాబెటిక్స్ వస్తుంది: నిద్రలేమి వల్ల చిన్న వయసులోనే షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఉబకాయం కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
నిద్రలేమి వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. గుండె ఆగిపోవడం గుండె పోటు గుండె సంబంధ సమస్యలు పెరగడానికి నిద్రలేమి కారణం అవుతుంది. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో జీవక్రియ సరిగా పనిచేయక ప్రతికూల ప్రభావాలను చూపుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.