Health Tips: ఆలివ్ ఆయిల్ వాడడం ద్వారా కలిగే లాభాలు ఏమిటి? ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
అయితే మామూలు నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆలివ్ ఆయిల్ ను వాడుతున్నారు.
ఆరోగ్యకరమైన జీవన శైలిలో మనం నూనె వాడుతూ ఉంటాం. అయితే మామూలు నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్ లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఆలివ్ ఆయిల్ ను వాడుతున్నారు. ముఖ్యంగా ఆలివ్ ఆయిల్ నుండి భారతదేశానికి వచ్చింది. అయితే ప్రస్తుతం భారతీయ వంటకాలలో ఇది అంతర్భాగం అయింది. అయితే ఆలివ్ ఆయిల్ తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది- ఆలివ్ ఆయిల్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఇందులో ఉండే బ్యూటరిక్ యాసిడ్ తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. వ్యాధులతో పోరాడడానికి మనకు కావాల్సినంత ఇమ్యూనిటీని పెంచుతుంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకోవడం ద్వారా శరీరంలో వచ్చే అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి మనం బయటపడవచ్చు.
చర్మానికి మంచిది- ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం ద్వారా వాటిలో ఉన్న పోషకాలు మన చర్మం లోపటికి వెళ్లి చర్మానికి మెరుపును తీసుకొస్తాయి. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఈ మనీ ఎప్పుడు కూడా యవ్వనంగా ఉంచుతాయి. చర్మం పొడి వారడం, ముడతలు రావడం ,వృద్ధాప్యం నుండి కాపాడుతుంది. దీన్ని చర్మం పైన కూడా అప్లై చేసుకోవచ్చు. చర్మం ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.
గుండెకు మంచిది- ఆలివ్ ఆయిల్ లో మోనోసాచ్యురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెకు మంచివి. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. రక్తంలోని కొలెస్ట్రాల స్థాయిలను నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రక్తంలోని LDLకొలెస్ట్రాలను తగ్గించి HDLకొలెస్ట్రాలను పెంచుతుంది.
Health Tips: పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువ ...
బరువును తగ్గిస్తుంది- ఆలివ్ ఆయిల్ గా మనం ఆహారంలో బాగా చేసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడతాయి. సలాడ్స్లో లైట్ మీల్ లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది- ఆలివ్ ఆయిల్ లో పొటాషియం అండ్ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గిస్తుంది. రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా బిపి కంట్రోల్ లో ఉంటుంది .రక్తనాళాలు ఫ్లెక్సిబుల్ గా తయారవుతాయి. గుండె ప్రమాదాలను తగ్గిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి