Health Tips: బత్తాయిలో ఉన్న పోషక విలువ విలువల గురించి తెలిస్తే షాక్ అవుతారు.
ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.
బత్తాయిలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. విటమిన్ సి ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ప్రతిరోజు ఒక బత్తాయి పండును తీసుకున్నట్లయితే మీ గుండె సంబంధ సమస్యలన్నీ తగ్గిస్తుంది. అంతేకాకుండా జీతం వ్యవస్థకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బత్తాయి పండు తీసుకోవడం వల్ల మీ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ఈ వర్షాకాలంలో వచ్చే అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఈ బత్తాయి పండు ఉపయోగపడుతుంది. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
విటమిన్ సి: బత్తాయిలో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఉత్పత్తికి సహాయపడుతుంది. దీని ద్వారా మన శరీరంలోని కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
ఫైబర్. బత్తాయి పండ్లు ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మన జీర్ణ క్రియ కు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాలను తగ్గించడానికి కూడా ఈ ఫైబర్ సహకరిస్తుంది.
Health Tips: మునగాకు పొడిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ ...
యాంటీ ఆక్సిడెంట్స్: బత్తాయిలో విటమిన్ సి కాకుండా విటమిన్ ఈ పాలిఫైనల్స్ వంటి ఇతర యాంటీ ఆక్సిడెన్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో వచ్చే ఇన్ఫర్మేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి.
గుండెకు మంచిది: బత్తాయిలో ఉండే విటమిన్ సి పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి మన బీపీని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గుండెపోటు ప్రమాదాలను తగ్గిస్తుంది.
నిద్రకు: బత్తాయిని తీసుకోవడం ద్వారా మన నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్సు ఫెరోటిన్లు ఉంటాయి. ఇది నిద్రకు ఉపకరిస్తుంది.
బరువు తగ్గడానికి: బత్తాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే మీ ఆకలి నియంత్రణలో ఉండి మీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
కంటికి మంచిది: బత్తాయిలో ఉండే ఆంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి విటమిన్ ఏ మన కంటి సంబంధ సమస్యలను తగ్గించడానికి సహకరిస్తుంది.
వర్షాకాలంలో వచ్చే ఈ పండును మీరు ఆహారంలో భాగం చేసుకుంటే మీకు రోగ నిరోధక శక్తి పెరిగి ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు జ్వరాలనుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.