Drumstick leaves are packed with many nutritional benefits. (Photo Credits: Flickr, Hari Prasad Nadig)

మునగాకుల్లో అనేక విటమిన్స్, అమైనో యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మునగాకుల్లో క్యారెట్ కంటే పది రెట్లు ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. అదేవిధంగా పాల కంటే 20 శాతం ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. పెరుగు కంటే 10% ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. మునగాకు పొడి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఇది బాలింతలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లులకు పాలభివృద్ధికి ఈ మునగాకు పొడి అనేది చాలా బాగా సహకరిస్తుంది. చాలామంది ఒళ్ళు నొప్పుల తోటి కండరాలను నొప్పులతో ఎముకల బలహీనతతో బాధపడుతుంటారు. అటువంటివారు ప్రతిరోజు మునగాకు పొడిని మీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడతారు.

పీరియడ్స్ వల్ల మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. వారు ఈ మునగాకు పొడిని ప్రతిరోజు రెండు ముద్దలు ఆహారంతో తీసుకున్నట్లయితే మీలో రక్తహీనత సమస్య తగ్గిపోయి రక్త వృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మీకు రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.

అంతేకాకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు కూడా ఈ మునగాకు పొడిని తీసుకున్నట్లయితే మీ థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది.

Health Tips: ఈ 7 కారకాలు క్యాన్సర్ లక్షణాలను పెంచుతాయి..

షుగర్ పేషెంట్స్ కూడా ఇది ఒక చక్కటి ఔషధం. మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది. మునగాకులో ఉన్న ఆంటీ డయాబెటిక్ కంటెంట్ వల్ల మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ప్రతిరోజు దీన్ని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే ఎప్పటికీ మీ షుగర్ నార్మల్ గా ఉంటుంది.

ఇందులో క్యాల్షియం ఐరన్ ప్రోటీన్ అధికంగా ఉండడం ద్వారా గర్భిణీలు కూడా ఈ మునగాకును తీసుకోవచ్చు. ఈ మునగాకును పూర రూపంలో గానీ పొడి రూపంలో గానీ తీసుకున్నట్లయితే మీకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే ఐరన్ డెఫిషియన్సీ క్యాల్షియం డెఫిషియన్సీ  సమస్యల నుంచి బయటపడతారు.

చాలామంది పాలిచ్చే తల్లుల్లో కొంత ఏజ్ రాగానే వారిలో కాల్షియం డెఫిషియన్సీ అధికంగా కనిపిస్తుంది. అలాంటివారు మీరు ఆహారంలో మునగాకుని ఆడ్ చేసుకున్నట్లయితే మీ కాల్షియం లోపం సమస్య అనేది తగ్గిపోతుంది.

కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఈ మునగాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మునగాకును పేస్ట్ చేసుకొని మచ్చలు మొటిమల పైన అప్లై చేసినట్లయితే మీ చర్మం నిగారింపును సంతరించుకుంటుంది.

మునగాకులను ఉడకపెట్టుకొని ఆ నీటిని వెనక తీసుకున్నట్లయితే మీలో మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. దీంట్లో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మీకు జీర్ణ సంబంధ సమస్యల నుంచి కూడా బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.