IPL Auction 2025 Live

Obesity-Diabetes Link: ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఎట్టకేలకు గుర్తించిన అమెరికా శాస్త్రవేత్తలు

అయితే, ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది?

obesity

Newyork, Nov 26: ఊబకాయం (Obesity) వల్ల మధుమేహం (Diabetes) ముప్పు పెరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే  పలు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. అయితే, ఊబకాయంతో మధుమేహం ఎందుకు వస్తుంది? ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయం ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా – లాస్‌ ఏంజెల్స్‌(యూసీఎల్‌ఏ)కు చెందిన శాస్త్రవేత్తల బృందం కొత్త విషయాన్ని గుర్తించారు. ఊబకాయం వల్ల రైబోసోమల్‌ ఫ్యాక్టర్స్‌ అనే కీలకమైన సెల్యూలర్‌ బిల్డింగ్‌ బ్లాక్స్‌ ను శరీరం సరిగ్గా ఉత్పత్తి చేయలేకపోతున్నట్టు గుర్తించారు. సరిపడా రైబోసోమల్‌ ఫ్యాక్టర్స్‌ లేకపోతే కొవ్వు మూలకణాలు.. పని చేసే కొవ్వు కణాలను ఉత్పత్తి చేయలేవు. ఇది క్రమం గా మధుమేహానికి దారి తీస్తున్నట్టు తేల్చారు.

ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కు అస్వస్థత.. చెన్నైలోని అపోలో దవాఖానలో చికిత్స.. ఛాతీలో నొప్పి కారణంగానేనంటూ మీడియాలో కథనాలు

అలా విరుగుడు

చిన్న, ఆరోగ్యకరమైన కణాలుగా ఉత్పత్తి చేసేలా కొవ్వు మూలకణాలను ప్రోత్సహించడం ద్వారా మధుమేహానికి చికిత్స అందించే అవకాశం ఉందని కూడా వీళ్లు తేల్చారు. మధుమేహ, ఊబకాయం ఉన్న ఎలుకలకు రోసిగ్లిటాజోన్‌ అనే ఔషధాన్ని ఇచ్చి చేసిన ప్రయోగం సఫలమైనట్టు చెప్పారు.

హైదరాబాద్‌ లోని జీడిమెట్లలో రోడ్డు మీద ఏరులై పారిన ఎర్రటి ద్రవం.. రక్తమేమోనని స్థానికుల ఆందోళన.. చివరకు తేలింది ఏమంటే? (వీడియోతో)