Lassa Fever: లస్సా ఫీవర్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే, లస్సా ఫీవర్ వచ్చిందని తెలుసుకోవడం ఎలాగో చూడండి, ఇప్పటికే యూకేలో ఒకరు మృతి, లస్సా ఫీవర్‌పై పూర్తి సమాచారం ఇదే..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి (CoronaVirus) ఇప్పటికే మూడు వేవ్‌ల రూపంలో అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే మరో వైరస్ మానవాళిపై విరుచుకుపడేందుకు రెడీ అయింది. ‘లస్సా ఫీవర్’ పేరుతో మరో ప్రాణాంతక వ్యాధి మానవాలిని భయపెడుతోంది.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి (CoronaVirus) ఇప్పటికే మూడు వేవ్‌ల రూపంలో అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి ఇంకా పూర్తిగా కనుమరుగవ్వక ముందే మరో వైరస్ మానవాళిపై విరుచుకుపడేందుకు రెడీ అయింది. ‘లస్సా ఫీవర్’ పేరుతో మరో ప్రాణాంతక వ్యాధి మానవాలిని భయపెడుతోంది. యూకేలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి ఓ వ్యక్తి మరణించడంతో (First Death from Lassa Fever in UK ) ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. లస్సా ఫీవర్ సోకిన ఓ వ్యక్తి ఫిబ్రవరి 11న మరణించాడు.
ఇది కూడా వైరస్ కారణంగా వచ్చే జ్వరం. బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఈ కొత్త వైరస్ (Lassa Fever) గురించి చెబుతూ, ఇది మహమ్మారి స్థాయిలో వ్యాపించే సత్తా ఉన్న వైరస్ అని వెల్లడించారు.అయితే లస్సా ఫీవర్ బ్రిటన్ కు కొత్త కాదు. 1980లోనే ఈ వైరస్ కారణంగా పలు కేసులు గుర్తించారు. 2009లో రెండు కేసులు వెల్లడయ్యాయి. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ (సీడీసీ) లస్సా ఫీవర్ జంతువుల నుంచి వ్యాపిస్తుందని వెల్లడించింది. ఇది ఎరెనా వైరస్ కుటుంబానికి చెందిన వైరస్ అని, ఇది తీవ్ర రక్తహీనత కలిగిస్తుందని వివరించింది.
తొలిసారి ఈ వైరస్ 1969లో వెలుగులోకి వచ్చింది. సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ పొల్యుషన్ ప్రకారం ఈ వ్యాధి సోకిన చాలా మందిలో ఎలాంటి లక్షణాలు (Lassa Fever Symptoms) ఉండడం లేదని, కొందరిలో మాత్రం తీవ్ర లక్షణాలతో పాటు ఆసుపత్రిలో చేరే అవకాశం కూడా ఉందని తెలిపారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా స్పందించింది. ఈ వైరస్ బారినపడిన ఎలుకలు ఆహార పదార్థాలపై మలమూత్ర విసర్జన చేసినప్పుడు, ఆ ఆహారాన్ని తీసుకున్న మనుషులు లస్సా వైరస్ బారినపడతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
కొన్ని సందర్భాల్లో ఇది వ్యక్తుల నుంచి వ్యక్తులకు కూడా వ్యాపిస్తుందని వివరించింది. అసలు, ఈ వైరస్ ను 1969లో ఆఫ్రికా దేశం నైజీరియాలో మొట్టమొదటిసారిగా గుర్తించారు. ఇది వెలుగు చూసిన పట్టణం ఆధారంగానే దీనికి లస్సా వైరస్ అనే పేరు వచ్చింది. ప్రతి ఏడాది 1 లక్ష నుంచి 3 లక్షల మంది వరకు లస్సా ఫీవర్ బారినపడుతుంటారని, 5 వేల మంది వరకు చనిపోతుంటారని సీడీసీ పేర్కొంది. ఈ వైరస్ మనుషులకు ఎలుకల నుంచి సోకుతుంది. వెస్ట్ ఆఫ్రికా, నైగేరియా, గునియా, లిబేరియా ప్రాంతాల్లో ఉండే ఎలుకల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ఎలుకలు ఇంట్లో ఉండే వస్తువులను తాకినప్పుడు వైరస్ సోకుతుంది. అలాగే వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరొకరి వ్యాపిస్తుంది.
ఇది ఒక్కసారి మానవదేహంలోకి ప్రవేశించాక 2 నుంచి 21 రోజుల వ్యవధిలో విస్తరిస్తుంది. అంటే సాధారణంగా వైరస్ సోకిన తర్వాత 1 నుంచి 3 వారాల వరకు లక్షణాలు బయటపడడం లేదు. అయితే చాలామందిలో లస్సా ఫీవర్ లక్షణాలు స్వల్పంగానే ఉంటాయని, కొందరిలో అయితే గుర్తించలేమని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. తొలుత జ్వరంతో ప్రారంభమై నీరసం వంటి లక్షణాలకు గురవుతారని, ఇన్ఫెక్షన్ ముదిరేకొద్దీ రోగిలో తలనొప్పి, గొంతునొప్పి, కండరాల నొప్పులు, ఛాతీ నొప్పి, వాంతులు, వికారం, విరేచనాలు, దగ్గు, కడుపు నొప్పి, జ్వరం, మొహం వాపు, బలహీనత, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలకు గురవుతారని వివరించింది.
ఈ లస్సా ఫీవర్ తీవ్రస్థాయికి చేరితే ముఖం ఉబ్బరించడం, ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం, కొన్ని అవయవాల నుంచి రక్తస్రావం జరగడం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. లస్సా ఫీవర్ ను గుర్తించడం చాలా కష్టమన్నది డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయం. వ్యాధి సోకిన మొదట్లో అయితే ఇది చూపించే లక్షణాల ఆధారంగా ఏమాత్రం గుర్తించలేమని అంటోంది. ఎబోలా, మలేరియా, షిగెలోసిస్, టైఫాయిడ్, యెల్లో ఫీవర్ ల తరహాలోనే దీని లక్షణాలు కూడా ఉంటాయని, దీన్ని ప్రత్యేకంగా గుర్తించడం కష్టమని అభిప్రాయపడింది.
లస్సా ఫీవర్ చికిత్సలో ప్రధానంగా రిబావిరిన్ వంటి యాంటీ వైరల్ ఔషధాలతో రోగులకు స్వస్థత చేకూరుతుందని సీడీసీ చెబుతోంది. అయితే, లస్సా ఫీవర్ లక్షణాలు కనిపించిన వెంటనే ఈ ఔషధాన్ని ఇస్తే సత్ఫలితాలు వస్తాయని తెలిపింది. అదే సమయంలో రోగి దేహంలో ఆక్సిజన్, రక్తపోటు, శరీర ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల మధ్య సమతూకం కూడా ముఖ్యమని సీడీసీ వివరించింది. ఇక సిడిసి(CDC) ప్రకారం, జ్వరంతో సంబంధం ఉన్న వారికి వినికిడి సమస్యలు కూడా రావొచ్చు.
ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది కోలుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయితే కొన్నిసార్లు ఇది తీవ్రమైన అనారోగ్యంగా సంభవించొచ్చు. WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ఈ వ్యాధి సోకిన వారి మరణాల రేటును 1% శాతంగా పేర్కొంది. అయితే తీవ్రమైన కేసులతో ఆసుప్రతిలో చేరిన రోగులలో గమనించిన రేటు మాత్రం 15%గా ఉంది. హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ(UKHSA) ప్రకారం, ఈ వ్యాధి వల్ల ప్రమాదం చాలా తక్కువే. ‘ఈ వ్యాధి సంక్రమణ నిర్ధారణకు ముందు కేసులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులను పరిశీలిస్తున్నామని, వారికి మద్దతు మరియు సలహాలు అందిస్తున్నట్లు' ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఎలా నిరోధించాలి?
* ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఉత్తమ మార్గం ఎలుకలతో సంబంధాన్ని నివారించండం.
* ముఖ్యంగా ఈ వ్యాధి చెందుతున్న దేశాల్లో, ఎలుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో సంబంధాన్ని నివారించడం.
* ఎలుకలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
* ఎలుకల కోసం ప్రత్యేక బోన్లలో ఆహారం ఉంచడం.. * ఎలుకలను బోనులో ఇరుక్కునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం వంటివి చేయాలని CDC సలహా ఇస్తోంది.
లస్సా జ్వరం అంటే ఏమిటి?
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ పొల్యూషన్(CDC) ప్రకారం, లస్సా ఫీవర్ కారక వైరస్ పశ్చిమ ఆఫ్రికాలో 1969 సంవత్సరంలో నైజీరియాలోని లస్సాలో తొలిసారిగా కనుగొనబడింది. ఇది ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. ప్రధానంగా పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా, లైబీరియా, లియోన్, గినియా మరియు నైజీరియా వంటి దేశాలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఎలుక మూత్రం లేదా మలంతో కలుషితమైన ఆహార పదార్థాలతో సంబంధం కలిగి ఉన్న ఈ వ్యాధి బారిన పడొచ్చు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)