ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్ పుట్టుకొచ్చినట్లు డెన్మార్క్‌లోని స్టాటెన్స్ సీరం ఇనిస్టిట్యూట్(ఎస్‌ఎస్‌ఐ)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యింది. సబ్ వేరియంట్‌ను బీఏ.2గా (Omicron Sub-Variant BA.2) పరిగణిస్తున్నారు. ఒమిక్రాన్‌కు బీఏ.1గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. బీఏ.2, బీఏ.1లలో ఏది అధికంగా వ్యాప్తి చెందుతోందన్న అంశాన్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. బీఏ.2 వ్యాప్తి వేగం అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీ అనే వెబ్‌సైట్‌లో ఈ అధ్యయన ఫలితాలను పోస్టు చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం బీఏ.2 సబ్ వేరియంట్‌కు సహజంగానే సంక్రమించిందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 (New Omicron subtype BA.2) ఏమార్చగలదని పేర్కొంటున్నారు. అంటే ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకోగలదని చెప్పొచ్చు.బీఏ.2 వ్యాప్తి రేటు 39 శాతం, బీఏ.1 వ్యాప్తి రేటు 29 శాతంగా ఉందని తమ అధ్యయనంలో గుర్తించినట్లు ఎస్‌ఎస్‌ఐ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎస్‌ఎస్‌ఐ అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హగన్, స్టాటిస్టిక్స్ డెన్మార్క్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు.
తాజాగా బీఏ.2 వేరియంట్ పలు దేశాల్లో కలకలం (Omicron 2.0 is Coming) రేపుతోంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాజా అధ్యయనాల ప్రకారం.. బీఏ.2 వేరియంట్ ఇప్పటికే.. 57 దేశాలలో వెలుగులోకి వచ్చింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కన్నా.. రెట్టింపు వేగంతో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కాగా, ఈ వేరియంట్ పదివారాల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. చాలా తక్కువ సమయంలో పలుదేశాల్లో విస్తరించిందని పరిశోధకులు తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించిన తాజా నమునాలలో.. అనేక కొత్త వేరియంట్‌లు కనుగొనబడ్డాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా.. బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్‌లు గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వీటిలో బీఏ.2 సబ్ వేరియంట్ ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని తెలిపారు.కొత్త వేరియంట్ ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకొనే సామర్థ్యం కల్గి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్‌వో (WHO) పరిశోధకుల్లో ఒకరైన వాన్ కెర్ఖోవ్ బీఏ.2 వేరియంట్‌పై స్పందించారు. దీనిపై సమాచారం పరిమితంగా ఉందని తెలిపారు. బీఏ.1 కంటె కూడా.. బీఏ.2 అధిక వ్యాప్తిని కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం డెల్లా వేరియంట్.. మునుపటి కరోనా కంటె.. తక్కువ తీవ్రత కల్గి ఉందని అన్నారు. ప్రస్తుతం కరోన ఒక ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని వాన్ కెర్ఖోవ్ అన్నారు.