Covid Vaccine: కరోనా వ్యాక్సిన్ నుంచి ఐదు నెలలే రక్షణ, ఆ తర్వాత దాని ప్రభావం క్షీణిస్తోందని తెలిపిన బ్రిటన్ పరిశోధకులు, బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు రెడీ అవుతున్న బ్రిటన్

వారు వివిధ రకాల వ్యాక్సిన్లపై పరిశోధనలు జరిపారు.

COVID-19 Vaccination (Photo Credits: PTI)

London, August 25: ప్రపంచ వ్యాప్తంగా కలవర పెడుతున్న కరోనా వైరస్‌ ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. అయితే, వైరస్‌ నుంచి ఇవి ఎంతకాలం రక్షణ కల్పిస్తాయనే విషయంపై ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ నుంచి కలిగే రక్షణ కొన్ని నెలల తర్వాత క్షీణిస్తోందని బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ( UK study on COVID-19) వెల్లడైంది. వారు వివిధ రకాల వ్యాక్సిన్లపై పరిశోధనలు జరిపారు.

వారి పరిశోధన ప్రకారం.. ఐదు నుంచి ఆరు నెలల్లోనే ఫైజర్‌, ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ల నుంచి పొందే రక్షణ తగ్గుముఖం (Protection gained after vaccination wanes in months) పడుతున్నట్లు తేలింది. యూకేలో వచ్చే నెల నుంచి బూస్టర్‌ డోసు ఇచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోన్న సమయంలో తాజా అధ్యయనం (ZOE COVID Study) అందుకు మరింత బలం చేకూరుస్తోంది. కరోనా వైరస్‌ లక్షణాలు, వ్యాక్సిన్‌ల పనితీరును తెలుసుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం రూపొందించిన ZOE కొవిడ్‌ యాప్‌ డేటాను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు.

ప్రమాదకరంగా మారుతున్న డెల్టా ప్లస్ వేరింయట్, దేశంలో 37,593 కొత్త కరోనా కేసులు, 648 మంది మృతి, మహారాష్ట్రలో ఒకే రోజు 27 కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదు

ఇందులో భాగంగానే కరోనా వ్యాక్సిన్‌లు తీసుకున్న 12లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించారు. ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న తొలి నెలలో 88శాతం రక్షణ కల్పించగా.. ఐదు నుంచి ఆరు నెలల తర్వాత అది 74శాతానికి తగ్గిపోయినట్లు గుర్తించారు. ఇక ఆక్స్‌ఫర్డ్‌/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ నుంచి కలిగే రక్షణ నాలుగు నుంచి ఐదు నెలల్లోనే 77శాతం నుంచి 67శాతానికి పడిపోయినట్లు కనుగొన్నారు.

ఇక వయసు పైబడినవారితో పాటు ఆరోగ్యసంరక్షణ సిబ్బందికి శీతాకాలం నాటికి ఈ వ్యాక్సిన్‌ల నుంచి కలిగే రక్షణ 50శాతానికి తగ్గే అవకాశం ఉందని తాజా అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ టిమ్‌ స్పెక్టర్‌ వెల్లడించారు. వ్యాక్సిన్‌ల నుంచి రక్షణ క్షీణిస్తోందని అంచనా వేయడమంటే.. వ్యాక్సిన్‌లను తీసుకోవద్దని కాదని డాక్టర్‌ టిమ్‌ స్పెక్టర్‌ అభిప్రాయపడ్డారు. టీకా తీసుకున్న కొన్ని నెలల తర్వాత వాటినుంచి రక్షణ తగ్గుతున్నప్పటికీ కరోనా మహమ్మారి నుంచి అవి పూర్తి రక్షణ కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు.

కరోనాతోనే పోలేదు, రాబోయే 60 సంవత్సరాల్లో అంతకన్నా ప్రమాదకర వైరస్‌లు దాడి చేసేందుకు రెడీ అవుతున్నాయి, సంచలన విషయాలను వెల్లడించిన పరిశోధకులు

ముఖ్యంగా డెల్టా వంటి వేరియంట్ల నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌లు అత్యంత రక్షణ ఇస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బూస్టర్‌ వ్యాక్సిన్‌ల కోసం వ్యూహాలు, ప్రణాళికలు రచించుకోవాల్సిన ఆవశ్యకత పెరిగిందని టిమ్‌ స్పెక్టర్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌లు విస్తృతంగా పంపిణీ చేయడం వల్ల ఇంగ్లాండ్‌లో దాదాపు 2.3కోట్ల ఇన్‌ఫెక్షన్‌లను, 84,600 కొవిడ్‌ మరణాలను నిర్మూలించగలిగినట్లు పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (PHE) వెల్లడించింది.

ఇక తక్కువ రోగనిరోధకత శక్తి కలిగిన వారికి మూడో డోసు వల్ల కలిగే ప్రయోజనాలను అంచనా వేసేందుకు OCTAVE DUO అధ్యయనాన్ని బ్రిటన్‌ చేపడుతోందని అక్కడి ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్‌ను నిరోధించడంలో వ్యాక్సిన్‌లు బలమైన రక్షణ గోడను నిర్మిస్తున్నాయని బ్రిటన్‌ ఆరోగ్యశాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా వైరస్‌తో కలిసి సురక్షితంగా జీవించడాన్ని ఇవి అనుమతిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.