Relation Tips: నా భర్త బూతులు మాట్లాడుతూ శృంగారం చేస్తున్నాడు, నాకు అవి చాలా అసహ్యం అనిపిస్తున్నాయి, ఆయనకు ఎలా చెప్పాలో తెలియడం లేదు..

మంచి అనుభూతి దొరుకుతుందని అన్నాడు. నాకు ఇది ఇబ్బంది, అదోరకంగా అనిపించింది. వద్దని చెప్పా. దాంతో అతను కాస్తా బాధగా తనని అర్థం చేసుకోమని అడిగాడు.

Relation Tips (Photo Credits: IANS)

ప్రశ్న: మొదటిసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు కలిసి రొమాన్స్ చేయడం హ్యాపీగా ఉంది. మేము శృంగారంలో ఉన్నప్పుడు ఫుల్ ఎగ్జైటింగ్‌గా ఉన్నప్పుడు నా హజ్బెండ్ నన్ను తనివితీరా ఆస్వాదిస్తూ ఓ మాట అన్నాడు. శృంగారం సమయంలో బూతులు మాట్లాడితే చాలా మూడ్ వస్తుందని.. మంచి అనుభూతి దొరుకుతుందని అన్నాడు. నాకు ఇది ఇబ్బంది, అదోరకంగా అనిపించింది. వద్దని చెప్పా. దాంతో అతను కాస్తా బాధగా తనని అర్థం చేసుకోమని అడిగాడు. నేను తన మాటలకి సైలెంట్ అయిపోయా. నాకు కాస్తా టైమ్ కావాలని అడిగా. కొన్ని రోజుల తర్వాత మేము మళ్ళీ ఆ కార్యంలో పాల్గొన్నాం. ఈ సారి అతను మళ్ళీ ముందుకంటే ఎక్కువగా బూతులు మాట్లాడడం ఘాటుగా చేయడం చూసి నాకు భయమేసి చలించిపోయా.ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు.

నా యోని లూజుగా ఉందని నా భర్త అక్రమసంబంధం అంటగడుతున్నాడు, నాకు భావప్రాప్తి కలగకపోవడం నా తప్పా.. దయచేసి చెప్పండి

జవాబు: మీ సమస్య చాలా సున్నితమైంది. చాలామంది మగవాళ్లకు శృంగారంలో బూతు పదాలు మాట్లాడుతూ సెక్స్ చేయడం ఇష్టపడుతుంటారు. అయితే ఈ బూతులను ఆడవాళ్లు అంతగా ఇష్టపడరు. దీనివల్ల శృంగార జీవితంలో మనస్పర్థలు వస్తుంటాయి. మీ భర్తకు బూతులు మాట్లాడితేనే మూడ్ వస్తుందనేది అపోహ అని మెల్లిగా నచ్చ చెప్పండి. ఒక్కసారిగా మారకపోయినా మెల్లిగా మారుతాడు. మరీ అంత పచ్చిగా మాట్లాడకుండా సుకుమార పదాలను మాట్లాడితే ఇష్టపడతాను అని మీ వారికి చెప్పండి. చిన్న విషయాలకు పెద్ద గొడవలు పెట్టుకుని సంసారం నాశనం చేసుకోకండి. వీలయితే ఇద్దరూ ఏకాతంగా ఉన్నప్పుడు మీ సమస్యను సున్నితంగా చెప్పండి. మీ భర్త తప్పక వింటాడు.