Weekend Sleep: వారాంతాల్లో బాగా నిద్రపోతున్నారా?? అయితే మీ గుండె భద్రంగా ఉన్నట్టే..!

సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు.

Sleep Representative Image

Newdelhi, Aug 31: మారిన జీవనశైలి (Life Style) కారణంగా నిద్రపోయే సమయాలు కూడా మారిపోతున్నాయి. సాఫ్ట్ వేర్ లైఫ్ లో పని దినాల్లో నిద్ర (Sleep) కరువవుతున్నది. దీంతో టెక్ వర్గం వారాంతాల్లో ఎక్కువ సమయం నిద్రపోతూ ఉంటారు. పని దినాల్లో కోల్పోయిన నిద్రకు పరిహారంగా వారాంతాల్లో ఇంకొంత ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని వాళ్లు భావిస్తుంటారు. బ్రిటన్‌ బయో బ్యాంక్‌ తాజా అధ్యయనం కూడా ఇది నిజమేనని తాజాగా వెల్లడించింది.

హైదరాబాద్‌ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ

ఆరోగ్యమే కాదు.. ఇంకా

వారాంతాల్లో ఎక్కువ సమయం మేలుకుని ఉండేవారికన్నా, ఎక్కువసేపు నిద్రపోయేవారు ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనం వెల్లడించింది. వీకెండ్స్ లో ఎక్కువ సేపు నిద్రపోయేవాళ్ళకు గుండె జబ్బుల ముప్పు 20 శాతం తగ్గుతుందని తేలింది.

పెంచిన పాశం ముందు కన్నపాశం అచ్చెరువొందిన వేళ.. కిడ్నాపర్ వద్ద నుంచి తల్లి వద్దకు వెళ్లనని మారాం చేసిన రెండేండ్ల బాలుడు... కిడ్నాపర్‌ పై పెంచుకున్న మమకారమే కారణం.. ఇంటర్నెట్ ను కదిలిస్తున్న భావోద్వేగ వీడియో ఇదిగో మీరూ చూడండి!!