Boy Clings to Kidnapper (Credits: X)

Newdelhi, Aug 31: కిడ్నాపర్ల (Kidnapper) చెరలో పసి మొగ్గలు పడే అవస్థలను, ఆ దృశ్యాలను సినిమాలు (Movies), సీరియళ్ళలో చూసి అయ్యో పాపం అని అనుకునే సందర్భాలు మీకు ఉండే ఉంటాయి. అయితే, ఇప్పుడు మీరు చదువబోతున్న వార్తా దానికి ఎంతో భిన్నం.. కిడ్నాపర్ చెర నుండి విడుదలైన ఓ బాలుడు తననుగన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లకుండా మారాం చేస్తూ గుక్కబెట్టి ఏడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏంటీ మీరు అనేది? కన్నవాళ్ల దగ్గరికి వెళ్లనని బాబు మారాం చేశాడా? అంటారా? అవును. అయితే, పూర్తిగా విషయం అర్థం కావాలంటే ఈ స్టోరీ చదువల్సిందే.

షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ, లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి, హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి..

Here's Video

సెల్‌ ఫోన్ వాడకుండా..

ఉత్తరప్రదేశ్ కు చెందిన తనూజ్ చాహర్ హెడ్ కానిస్టేబుల్ (రిజర్వ్ పోలీస్)గా పనిచేసేవాడు. అయితే, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో అతన్ని సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో వ్యసనాలకు బానిసైన అతను ఒకానొక సమయంలో రాజస్థాన్ కు చెందిన పృధ్వీ అనే నెలల ప్రాయంలోనే ఉన్న బిడ్డను తల్లి నుండి దూరం చేసి ఎత్తుకెళ్లిపోయాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సెల్‌ ఫోన్ వాడకుండా, ఎప్పటికప్పుడు వేషం మారుస్తూ వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నాడు. దాదాపు 14 నెలల తర్వాత అతన్ని, బిడ్డను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువ‌లో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు

మమకారంతో..

బిడ్డతో పాటు తనూజ్ చాహర్‌ ను ఆలీఘర్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. బాబు దొరికిన విషయాన్ని ఆ బాలుడిని తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ మేరకు వారిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అయితే 14 నెలలుగా తనూజ్ చాహర్ వద్దే పెరగడంతో ఆ బాలుడు తల్లిదండ్రులను గుర్తించలేదు. అలాగే తనూజ్‌ పై ఉన్న మమకారంతో అతన్ని వదిలివెళ్లడానికి బాబు మారాం చేశాడు. గుక్కపెట్టి ఏడ్చాడు. బాబును ఇంతకాలం కన్నబిడ్డలాగే చూసుకున్న తనూజ్ కూడా కన్నీటిపర్యంతమయ్యాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి బాబు మారాం చేస్తున్నా.. పోలీసులు బలవంతంగా వారికి అప్పగించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. వీడియో చూసిన ప్రతీఒక్కరు భావోద్వేగానికి గురవుతూ పెంచిన పాశం ముందు కన్నపాశం ఓడిపోయింది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

అసలు ట్విస్ట్ ఇలా..

చిన్నారి తల్లి పూనమ్ చౌదరిని తనతో వచ్చేయాలని తనూజ్ తొలుత ఒత్తిడి చేశాడని, ఆమె నిరాకరించడంతోనే బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడని పోలీసుల విచారణలో బయటపడింది. దీంతో తనూజ్ వ్యవహారశైలిపైన కొందరు నెటిజన్లు నెగటివ్ గా కామెంట్స్ చేస్తుండగా.. గతంలో అతని ప్రవర్తన ఎలా ఉన్నా.. బాబునైతే ప్రేమగా పంచాడు కదా అంటూ మరో వర్గం కిడ్నాపర్ కు వకాల్తా పుచ్చుకోవడం గమనార్హం.