హబ్సిగూడలో లారీ ఢీకొట్టడంతో పాఠశాల విద్యార్థిని మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. గురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. సాయంత్రం పాఠశాల అయిపోగానే తన తల్లితో స్కూటీ మీద ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని కింద పడింది.. లారీ వెనక చక్రాలు కామేశ్వరి పై నుండి వెళ్లడంతో మృతి చెందింది. వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు.ప్రమాదంతో అప్రమత్తమైన వాహనదారులు బాలికను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బాలిక మరణించింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై పదో తరగతి విద్యార్థిని మృతి చెందింది.
నో ఎంట్రీ సమయంలో సిటీలోకి లారీలు ఎలా వస్తున్నాయని? ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారని? పాప మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.
Here's Video
సీసీటీవీ ఫుటేజీ.. లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి
హబ్సిగూడలో నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో 6వ తరగతి చదివే కామేశ్వరి అనే విద్యార్థిని మృతి చెందింది.
సాయంత్రం పాఠశాల అయిపోగానే తన తల్లితో స్కూటీ మీద ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని కింద పడింది.. లారీ వెనక… pic.twitter.com/qnJBap2NS1
— Telugu Scribe (@TeluguScribe) August 30, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)