Sperm (photo-Pixabay)

CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవలి బహుళ-సంస్థాగత అధ్యయనంలో "TEX13B జన్యువు స్పెర్మ్‌కు అవసరమని మొదటిసారిగా గుర్తించారు. తల్లి నుండి వచ్చే లోపభూయిష్ట జన్యువు కొడుకు సంతానలేమికి కారణమవుతుందని కొత్త అధ్యయనం తెలిపింది. హైదరాబాద్‌లోని CSIR-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీతో పాటు ఇతర విశ్వవిద్యాలయాల పరిశోధకులు స్పెర్మ్ సెల్స్ ఏర్పడటానికి, పురుషుల సంతానోత్పత్తికి X క్రోమోజోమ్ జన్యువు (TEX13B) అవసరమని నిర్ధారించారు.

సీసీఎమ్‌బీ అధ్యయనం ప్రకారం..పురుషుల సంతాన లేమికి తల్లి నుంచి సంక్రమించే లోపభూయిష్ట జన్యువు కారణమని తొలిసారిగా తేలింది. ఎక్స్ క్రోమోజోమ్‌లో ఈ జన్యువు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాలను సీసీఎమ్‌బీ గురువారం వెల్లడించింది. వీర్యం లేకుండా పిల్లాడు పుట్టే కొత్త టెక్నాలజీ, స్టెమ్ సెల్స్ సహాయంతో ప్రపంచంలోని మొట్టమొదటి కృత్రిమ మానవ పిండం తయారు చేసిన శాస్త్రవేత్తలు

సీసీఎమ్‌బీ పరిశోధకుల ప్రకారం, ప్రపంచంలోని ప్రతి ఏడు జంటల్లో ఒకరు సంతానలేమితో బాధపడుతున్నారు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తక్కువగా ఉండటం, శుక్రకణాల, సైజు, నిర్మాణం కదలికల్లో లోపాలు కారణంగానే సగం సందర్భాల్లో పురుషుల్లో సంతానలేమి తలెత్తుతోంది. అయితే, పురుషులకు వారి తల్లుల నుంచి ఎక్స్ క్రోమోజోమ్ ద్వారా సంక్రమించే జన్యులోపమే ఈ పరిస్థితికి కారణమని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు.

అత్యాధునిక జన్యుక్రమ విశ్లేషణ పద్ధతులతో శాస్త్రవేత్తలు సంతానలేమితో బాధపడుతున్న పురుషులు, ఆరోగ్యవంతుల జన్యువులను విశ్లేషించారు. ఈ క్రమంలో సంతానలేమితో బాధపడుతున్న పురుషుల్లోని ఎక్స్ క్రోమోజోమ్‌లో టీఈఎక్స్13బీ అనే లోపభూయిష్ట జన్యువును గుర్తించారు. మరో జన్యువు కూడా వీరిలో అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. అదేపనిగా హస్తప్రయోగం చేసుకుంటే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందా, సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందా, నిపుణులు ఏమంటున్నారు..

తరువాతి తరం సీక్వెన్సింగ్ ఉపయోగించి, మేము సంతానోత్పత్తి, సారవంతమైన మగవారి మధ్య అన్ని జన్యు కోడింగ్ ప్రాంతాలను (ఎక్సోన్స్) పోల్చాము. మేము TEX13B జన్యువులో రెండు కారణ ఉత్పరివర్తనాలను కనుగొన్నాము, వాటిలో ఒకటి ప్రత్యేకంగా సంతానోత్పత్తి లేని పురుషులలో కనుగొనబడింది మరియు మరొకటి సంతానోత్పత్తి నియంత్రణ పురుషులతో పోలిస్తే వంధ్య పురుషులలో చాలా తరచుగా కనుగొనబడింది, ”అని పీహెచ్‌డీ విద్యార్థి అయిన మొదటి రచయిత ఉమేష్ కుమార్ అన్నారు.