West Nile fever in Kerala: కేరళలో కొత్తగా వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌ కలవరం, గతంలో ఆరేళ బాలుడు మృతి, వైరల్‌ జ్వరం లక్షణాలు ఇవిగో..

ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర (Kerala) ఆరోగ్యశాఖ ఆదేశించింది. వెస్ట్‌ నైల్‌ అనేది వైరల్‌ జ్వరం.

West Nile fever in Kerala,

కేరళకు పలు ప్రాంతాల్లో తాజాగా ‘వెస్ట్‌ నైల్‌ ఫీవర్‌’ (West Nile fever) కలకలం రేపుతోంది. ఈనేపథ్యంలో అన్ని జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర (Kerala) ఆరోగ్యశాఖ ఆదేశించింది. వెస్ట్‌ నైల్‌ అనేది వైరల్‌ జ్వరం. ఇన్‌ఫెక్షన్‌ సోకిన క్యూలెక్స్‌ దోమ ద్వారా మానవులకు ఇది సంక్రమిస్తుంది. దీనికి ఎటువంటి ఔషధాలు, వ్యాక్సిన్‌ లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేయడం, వ్యాధి నిరోధక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో ఈ ఏడు రకాల ఆహారాలు తినకూడదు, కాదని తింటే చేతులారా అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే..

1937లో ఉగాండాలో తొలిసారిగా దీన్ని గుర్తించారు. మనదేశంలో మొదటిసారిగా కేరళలో 2011లో ఓ ఆరేళ్ల బాలుడిలో వెలుగు చూసింది. ఆ అబ్బాయి 2019లో జ్వరం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఫీవర్‌ వ్యాప్తిలో ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ పేర్కొన్నారు. జ్వరం లేదా వెస్ట్‌ నైల్‌ ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించి లక్షణాలు కనిపిస్తే మాత్రం తక్షణమే చికిత్స తీసుకోవాలని సూచించారు.

లక్షణాలు..

తలనొప్పి, జ్వరం, కండరాల నొప్పులు, తల తిరగడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం వంటి లక్షణాలు ఉంటాయి. కానీ, ఎక్కువమంది బాధితుల్లో ఇవి కనిపించకపోవచ్చు. మరికొందరిలో మాత్రం జ్వరం, తలనొప్పి, వాంతులు, దురద వంటి లక్షణాలుంటాయి. కేవలం ఒక్క శాతం కేసుల్లో మాత్రం మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు. జపనీస్‌ ఎన్‌కెఫలైటిస్‌ వ్యాధితో పోలిస్తే లక్షణాలు ఒకేవిధంగా ఉన్నప్పటికీ మరణాల రేటు తక్కువే.