Is 'Saree Cancer' Real?: చీర బిగువుగా కట్టుకునే మహిళలకు చర్మ క్యాన్సర్‌ ముప్పు, కీలక హెచ్చరికను జారీ చేసిన వైద్యులు, ఇద్దరికీ ఇప్పటికే క్యాన్సర్

అయితే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరపై వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు ఉంటుందని తెలిపారు.

Woman in Saree (photo-Pixabay)

భారతీయ వస్త్రధారణలో చీరకు ప్రముఖ స్థానం ఉంది. అయితే మహిళలు ఎంతో ఇష్టంగా కట్టుకునే చీరపై వైద్యులు కీలక హెచ్చరిక చేశారు. చీర బిగువుగా కట్టుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ ముప్పు ఉంటుందని తెలిపారు.మహారాష్ట్రలోని వార్ధలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ మెడికల్‌ కాలేజీ, బీహార్‌లోని మధుబని కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు ఇటీవల ఇద్దరు మహిళలు పార్శ్యంపై నొప్పితో వచ్చారు. వీరిని పరీక్షించిన వైద్యులు ఇద్దరికీ మార్జోలిన్‌ అల్సర్‌ అనే చర్మ క్యాన్సర్‌ ఉన్నట్టు గుర్తించారు.

మ‌నం వాడే వాట‌ర్ బాటిల్స్ టాయిలెట్స్ సీట్ల కంటే డేంజర్! షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన నిపుణులు

వీరిద్దరూ రోజూ చీర కట్టుకుంటారని, చీర లోపల పెట్టికోట్‌ను నడుముకు బిగువుగా కట్టుకోవడం వల్లే చర్మ క్యాన్సర్‌ బారిన పడ్డారని వైద్యులు గుర్తించారు. నడుముకు బిగువుగా చీర లేదా పెట్టికోట్‌ కట్టడం వల్ల తీవ్రమైన ఒత్తిడి కలిగి అల్సర్‌ ఏర్పడుతుందని, ఇది క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. మహిళలు పెట్టికోట్‌, చీరను వదులుగా ధరించాలని సూచించారు.