Special Entry Darshan Tickets: సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా రేపు విడుదల
ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ (TTD) విడుదల చేసింది. ఇక సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను గురువారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. దీంతో పాటుగా జూలై 12, 15, 17 తేదీల్లోని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను బుధవారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. శ్రీవారి భక్తులు టీటీడీ వెబ్‌సైట్‌లో స్వామివారి దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని కోరింది.
ఇక సోమవారం భారీగా రూ.6.18 కోట్ల కానుకల్ని హుండీలో సమర్పించుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఒకరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటటం ఇది రెండోసారి. 2018 జూలై 26న రూ.6.28 కోట్ల కానుకలు హుండీలో లభించాయి. కరోనా తరువాత ఈ సంవత్సరం నుంచి సర్వదర్శనానికి భక్తులందరికీ అవకాశం కల్పించడంతో.. గత రెండేళ్లుగా తిరుమలకు రాలేని భక్తులు స్వామిని దర్శించుకుని భారీగా హుండీ కానుకలు సమర్పించుకుంటున్నారు.