Happy New Year 2025: కొత్త సంవత్సరం సందర్భంగా మీ బంధుమిత్రులతో కలిసి హైదరాబాద్ సమీపంలో చూడగలిగిన టాప్ 5 పర్యాటక కేంద్రాలు ఇవే
అయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చక్కటి ఐదు డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం
వీకెండ్ వచ్చిందంటే చాలు ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా ఈ సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలను జరుపుకోవడానికి ఎక్కడికి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా. అయితే హైదరాబాద్ సమీపంలో ఉన్నటువంటి చక్కటి ఐదు డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడికి వెళ్లడం ద్వారా మీరు చక్కగా కుటుంబంతో సహా ఎంజాయ్ చేయవచ్చు.
1. నాగార్జునసాగర్- హైదరాబాదుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నాగార్జునసాగర్ చక్కటి పర్యాటక కేంద్రం ఇక్కడ దేశంలోనే అతిపెద్ద రిజర్వాయర్లలో ఒకటైన నాగార్జునసాగర్ ఉంది. దాంతోపాటు పలు మ్యూజియంలో అదే విధంగా ప్రకృతి సుందరమైన దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి. నాగార్జునసాగర్ సమీపంలో ఉన్నటువంటి ఎత్తిపోతల జలపాతం కనుల విందు చేస్తుంది. ప్రకృతి రమణీయతను ఆరాధించే వారికి ఇది చక్కటి హాలిడేస్ స్పాట్ అని చెప్పవచ్చు.
Astrology: మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా
2. యాదగిరిగుట్ట: హైదరాబాద్ సమీపంలోనూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామి స్వయంభూగా వెలసి ఉన్నాడు. హైదరాబాద్కు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి లక్షలాదిగా ప్రజలు తరలివస్తుంటారు. మీరు ఒకవేళ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం రోజు దర్శించుకోవాలనుకుంటే ఇది ఒక చక్కటి ఛాయిస్ అని చెప్పవచ్చు.
3. రామోజీ ఫిలిం సిటీ- హైదరాబాద్ సమీపంలో ఉన్న రామోజీ ఫిలిం సిటీ మీ ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇక్కడ అనేక రకాల పార్కులు ఎంయూజిమెంట్ కేంద్రాలు అనేకం ఉన్నాయి. వీటిని మీరు సందర్శించడం ద్వారా పిల్లలకు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సరికొత్త అనుభూతిని పంచవచ్చు.
4. అనంతగిరి కొండలు- హైదరాబాద్ సమీపంలో వికారాబాద్ వద్ద ఉన్న అనంతగిరి కొండలు ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడ చిన్న చిన్న జలపాతాలు అదేవిధంగా చక్కటి విడిది కోసం రిసార్టులు అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ వారాంతంలో మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. నూతన సంవత్సరం వేడుకలను కూడా నిర్వహించుకోవచ్చు.