Darshan of Shri Ram Lalla on the First Day: తొలి రోజు అయోధ్య రామాలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తజనం.. వేకువజామున 3 గంటలకే చేరుకున్న కొందరు భక్తులు.. కిక్కిరిసిపోయిన ప్రధాన ద్వారం.. తోపులాటలు.. తొలిరోజు సుమారు 5 లక్షల మంది ఆలయాన్ని సందర్శించవచ్చని అంచనా (వీడియో ఇదిగో)
రామభక్తులు కొందరు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు.
Ayodhya, Jan 23: ప్రాణప్రతిష్ఠ (Pranaprathishta) మరుసటి రోజు అయోధ్య శ్రీరాముడిని (Lord Sriram) దర్శించుకునేందుకు తొలి రోజు ఊహించనిరీతిన భక్తులు పోటెత్తారు. రామభక్తులు (Devotees) కొందరు వేకువజామున 3 గంటలకే ఆలయానికి వచ్చేశారు. తొలి రోజు రామ్ లల్లా దర్శించుకోవడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారం వెలుపల భారీ భక్త జనసందోహం నెలకొంది. దర్శనం కోసం భక్తులు నిరీక్షిస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాగా చిన్నపాటి తోపులాటలు కూడా జరిగినట్టు పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా తొలి రోజు అయోధ్య రామాలయాన్ని సుమారు 5 లక్షల మంది భక్తులు సందర్శించవచ్చుననే అంచనాలున్నాయి. కాగా భక్తులు ఉదయం 8 గంటల నుంచి బాల రాముడిని దర్శించుకోవచ్చని ఆలయ పెద్దలు చెబుతున్నారు. మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివుంచుతారని తెలిపారు. ఉదయం 6:30 గంటలకు, రాత్రి 7:30 గంటల సమయంలో ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఇక భక్తులు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో దర్శనం, హారతి పాస్ లను పొందవచ్చు.
హారతి/దర్శనం పాస్ లు ఎలా పొందాలి?
బాలరాముడి దర్శనానికి భక్తులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా పాస్‌లు పొందవచ్చు. అయితే ఆన్‌లైన్ బుకింగ్ ప్రస్తుతానికి ప్రారంభం కాలేదు. అప్‌డేట్స్ కోసం ట్రస్టు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవాలి.
ఆన్ లైన్ బుకింగ్ ఎలా..
- అయోధ్య రామాలయ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది.
- మై ఫ్రొఫైల్’ అనే సెక్షన్‌పై క్లిక్ చేసి, హారతి/దర్శన స్లాట్‌ను ఎంపిక చేసుకోవాలి.
- అవసరమైన వివరాలు సమర్పించి పాస్ బుకింగ్ చేసుకొన్న తర్వాత.. కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
- ఆలయం ప్రాంగణంలోని కౌంటర్ వద్ద పాస్ తీసుకొని దర్శనానికి వెళ్లొచ్చు.
ఆఫ్ లైన్ లో ఎలా..
ఆలయ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లి, చెల్లుబాటు అయ్యే ఏదైనా ప్రభుత్వ ధ్రువీకరణ ఐడీ సమర్పించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో పాస్‌లు పొందవచ్చు.
దర్శనం/హారతి వేళలు
- రామ్ లల్లా దర్శన సమయం- ఉదయం 7.00-11.30
- మధ్యాహ్నం 2.00-7.00
- జాగరణ్/శృంగార్ హారతి ఉదయం 6.30
- సంధ్యా హారతి సాయంత్రం 7.30\