Ram Mandir Pran Pratishtha Ceremony: ప్రధాని మోదీ చేతుల మీదుగా ముగిసిన అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం, వీడియో ఇదిగో..
వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు.
Ayodhya, Jan 22: భక్తి పారవశ్యం అంబరాన్ని తాకేలా అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సోమవారం అంగరంగ వైభవంగా జరగింది. వేల మంది ప్రత్యక్ష, కోట్ల మంది పరోక్ష వీక్షణ మధ్య.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య ఆలయంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఈ క్రతువులో పాల్గొన్నారు.
మధ్యాహ్నం 12:20 నుంచి ఒంటి గంట మధ్య ‘అభిజిత్ లగ్నం’లో (Abhijit) ఈ వేడుక జరిగింది. వేదమంత్రాలు, మంగలవాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ క్రతువు పూర్తి అయింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వామి వారికి పట్టువస్త్రాలు, ఛత్రం సమర్పించారు.
రామ్ లల్లా విగ్రహం మొదటి విజువల్స్ ఇవిగో, దేదీప్యమానంగా వెలిగిపోతున్న బాలరాముడు
ఈ ముహూర్తం కేవలం 84 సెకండ్లు మాత్రమే. మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ఉండే ఈ దివ్య ముహూర్తంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ క్రతువును చేపట్టారు. ఆ ముహూర్తంలోనే రామ్ లల్లా విగ్రహ కళ్లకు ఉన్న కంతల్ని తీసేసి బంగారంతో ప్రత్యేకంగా చేసిన చిన్న కడ్డీతో శ్రీరాముడికి కాటుక దిద్దారు. 108 దీపాలతో ‘మహా హారతి’ ఇచ్చారు.
Here's Videos
ఈ మహా హారతితో ప్రాణ ప్రతిష్ట క్రతువు ముగిసింది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో 150 మంది సాధువులు, మత గురువులు, 50 మంది ఆదివాసీ తెగలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కరసేవకుల కుటుంబ సభ్యులు సహా ఆహ్వానం అందుకున్న 7 వేల మంది అతిథులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు.