Sabarimala Temple Opened: మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
Sabarimala, Dec 30: కేరళలోని (Kerala) ప్రసిద్ధ శబరిమల ఆలయం (Sabarimala Temple Opened) ఈ ఏడాది మకరజ్యోతి పండుగ సందర్భంగా సోమవారం నుంచి తెరుచుకోనున్నది. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రధాన పూజారి తంత్రి కందర్ రాజీవరు నేతృత్వంలో నేడు సాయంత్రం 4 గంటలకు మేళశాంతి ఎస్ అరుణ్ కుమార్ ఆలయాన్ని తెరుస్తారని చెప్పారు. ఈ పండుగలో భాగంగా ప్రతి ఏడాది జనవరి 14న సంక్రాంతినాడు భక్తులు మకర జ్యోతిని దర్శించుకుంటారు.
మొన్నే మూసివేత
మండల పూజ అనంతరం డిసెంబర్ 26న అంటే గత గురువారం ఆలయాన్ని మూసివేశారు. 41 రోజులపాటు సాగిన పూజల్లో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.