Yadadri Temple: ఈనెల 25న యాదాద్రి ఆలయం మూసివేత, సాయంత్రం 4.59 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం కానున్న సూర్యగ్రహణం

ఈ నెల 25న సూర్యగ్రహణం (partial solar eclipse) ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు (Yadadri hill shrine will be closed) ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Yadadri Temple | File Photo

ఈ నెల 25న సూర్యగ్రహణం (partial solar eclipse) ఉన్నందున యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు (Yadadri hill shrine will be closed) ఆలయ ఈవో గీతారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిత్య కైంకర్యాలు, నివేదన ఉదయం 8.50 గంటల్లోపు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సాయంత్రం 4.59 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6.28 గంటలకు సమాప్తం అవుతుందని తెలిపారు.

దీంతో ఆ రోజు ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ 8 గంటల వరకు ఆలయాన్ని మూసివే­యనున్నట్లు వెల్లడించారు. తిరిగి మర్నాడు ఉదయం 8 గంటలకు ఆలయాన్ని తెరచి.. సంప్రోక్ష­ణ అనంతరం 10 గంటల నుంచి భక్తుల­ను దైవ దర్శనాలకు అనుమతించనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా నిత్యపూజలు రద్దు చేసినట్టు చెప్పారు.దీనిని భక్తులు గమనించగలరని పేర్కొన్నారు.

వైరల్ వీడియోలు, హైదరాబాద్ వరదల్లో కొట్టుకుపోతున్న బైకులు, నడుం లోతు నీళ్లలో వాహనాదారులు అవస్థలు

25వ తేదీన నిత్య, శాశ్వత కల్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవం రద్దు చేయనున్నారు. 26న నిర్వహించే శత ఘట్టాభిషేకం, సహస్రనామార్చనను రద్దు చేశారు. 26న సంప్రోక్షణ నిర్వహించి 10:30 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. ఆ తర్వాత యాథావిధిగా నిత్య కైంకర్యాలు మొదలు కానున్నాయి.