TTD Srivari Brahmotsavam: సెప్టెంబరు 18వ తేది నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 18వ తేది నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.సెప్టెంబరు 18న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని వెల్లడించారు. ఈ మేరకు ఆలయం వెలుపల బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను టీటీడీ చైర్మన్ విడుదల చేశారు.
ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 22న గరుడ సేవ, 23న స్వర్ణరధం, 25న రధోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజా అవరోహనం నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో అధిక రద్దీ నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నమని పేర్కొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఏడు రోజులు ఏటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబోమని తెలిపారు.
ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలను ఘనంగా, సాంప్రదాయంగా టీటీడీ సిబ్బందితో పాటుగా, అన్ని విభాగాల సమన్వయంతో ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని చెప్పారు. తిరుమలలో సామాన్య భక్తులకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నమని భూమన కరుణాకర్ పేర్కొన్నారు. భక్తులకు భద్రత విషయంతో ఎటువంటి లోటు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సిబ్బంది విశ్వ ప్రయత్నం చేస్తోందని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులు తరలిరావాలని కోరారు.
ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉంటాయని ధర్మారెడ్డి స్పష్టం చేశారు.టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడుతూ.. ‘బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రివ్యూ చేశాం. ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. సెప్టెంబర్ 18న శ్రీవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సెప్టెంబర్ 22న గరుడవాహనం, 23న స్వర్థరథంపై శ్రీవారి ఊరేగింపు ఉంటుంది’ అని తెలిపారు.
రాఖీ పండుగ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులు 18 కంపార్ట్‌మెంట్‌లలో నిండిపోయి ఉన్నారు. టికెట్లు లేని సర్వదర్శనానికి(ఉచిత దర్శనం) ఏడు గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆగష్టు 30, 2023) స్వామివారిని 71,132 భక్తులు దర్శించుకున్నారు. 26,963 తలనీలాలు సమర్పించుకున్నారు. రూ. 4.06 కోట్ల హుండీ ఆదాయం లెక్కగా తేలింది.