Ayodhya Tour: అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్లే భక్తులకు ప్రయాణం ఉచితం, ఆఫర్ ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి!

Paytm Ayodhya tour offer | Paytm Photo

Ayodhya Tour: అయోధ్యలో బాల రాముడు కొలువుదీరటంతో ఇప్పుడు దారులన్నీ అయోధ్యవైపే చూపిస్తున్నాయి. శ్రీరాముడిని కనులారా దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు రామమందిరానికి తరలి వెళ్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా నగదు చెల్లింపుల సంస్థ 'పేటీఎం' కూడా అయోధ్య వెళ్లాలనుకునే భక్తుల కోసం ఒక అద్భుతమైన ఆఫర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ వినియోగించుకోవడం ద్వారా యాత్రికులు తమ అయోధ్య ప్రయాణానికి అయ్యే ఖర్చును ఉచితంగా మార్చుకోవచ్చు. మరి ఆ ఆఫర్ ఏమిటి? ఎలా పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

పేటీఎం సంస్థ ప్రకటన ప్రకారం.. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించేందుకు బస్సు లేదా విమానం టికెట్లను  Paytm ద్వారా బుక్ చేసి చెల్లింపు చేసినట్లయితే 100% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. బుకింగ్ సమయంలో ప్రోమో కోడ్ ఉపయోగించటం ద్వారా ఈ లాభదాయకమైన ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను పొందే అవకాశం ఉంటుంది. బస్సు బుకింగ్‌ల కోసం 'BUSAYODHYA' అనే ప్రోమో కోడ్‌ని అదేవిధంగా విమాన టికెట్ బుకింగ్ కోసం 'FLYAYODHYA'  అనే ప్రోమో కోడ్‌ని ఉపయోగించవచ్చు. అయితే, ప్రతీ పదవ కస్టమర్ మాత్రమే ఈ Paytm క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను గెలుచుకుంటారని నిబంధన విధించింది. ఈ ప్రోమో కోడ్ ద్వారా బస్సు ప్రయాణికులు రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు, అలాగే విమాన టిక్కెట్‌లను బుక్ చేసుకునే వారు రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకునే అవకాశం ఉంది.

పనిలోపనిగా 'ఫ్రీక్యాన్సలేషన్' కూడా పేటీఎం అందిస్తుంది. యాత్రికులు ఈ ప్రోమో కోడ్ ఉపయోగించి బుకింగ్ చేసుకుంటే, యాత్ర తేదీలో మార్పు లేదు యాత్రను రద్దు చేసుకుంటే, ఇందుకోసం చెల్లించిన మొత్తం డబ్బు 100 శాతం రీఫండ్ చేయనున్నట్లు పేటీఎం తెలిపింది.

అయోధ్యలోని రామమందిర ట్రస్ట్‌కు విరాళాలు అందించాలనుకునే భక్తులు సైతం తమ యాప్‌ను ఉపయోగించవచ్చని Paytm ప్రకటించింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif