Karnataka High Court: వరకట్నం పేరిట తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై.. భర్త కూడా కేసు పెట్టొచ్చు.. కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు
ఆమెపై తిరిగి కేసు పెట్టేందుకు భర్తకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది.
Bengaluru, July 2: భర్తను వేధించడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలతో (false charges) కేసు పెట్టిన భార్యకు కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెపై తిరిగి కేసు పెట్టేందుకు భర్తకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకకు (Karnataka) చెందిన వ్యక్తి ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. పెండ్లి అయిన రెండు నెలల తర్వాత హెచ్1బీ వీసా గడువు ముగియనుండటంతో తిరిగి అమెరికాకు వెళ్లారు. తన భార్యను కూడా అమెరికాకు తీసుకెళ్లడానికి పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ అమెరికాకు రావడానికి ఆమె ఆసక్తి చూపలేదు. దీంతో ఆయన 2021 డిసెంబరు 3న విడాకుల కోసం బెంగళూరులోని కుటుంబ న్యాయస్థానంలో దరఖాస్తు చేశారు.
భర్తపై తీవ్ర ఆరోపణలు
దీన్ని గమనించిన ఆమె వరకట్నం వేధింపులు, లైంగిక రోగం ఉందని భర్తపై తీవ్ర ఆరోపణలు చేసి కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో జస్టిస్ నాగ ప్రసన్న ఈ కేసు వివరాలను పరిశీలించారు. భర్త వరకట్నం డిమాండ్ చేసినట్లు కాని, క్రూరత్వం ప్రదర్శించినట్లు కాని వెల్లడి కాలేదని న్యాయమూర్తి గుర్తించారు. దీంతో భార్యపై కేసు పెట్టేందుకు భర్తకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం ఈ తీర్పు సంచలనంగా మారింది.
కలుద్దామంటూ రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ, జూలై ఆరో తేదీన ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య భేటీ..