Kerala Lottery: అదృష్టం అంటే ఇదేగా.. 11 మంది మహిళలు కలిసి రూ.250 పోగేసి లాటరీ టిక్కెట్ కొనుగోలు.. దానికే తగిలిన రూ.10 కోట్లు.. తమ ఆర్థిక కష్టాలు తీరుతాయని మహిళల హర్షం.. కేరళలో ఘటన

కేరళకు చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం అనూహ్యంగా వరించిన ఘటన ఇది.

Indian Currency | Representational Image | (Photo Credits: Wikimedia Commons)

Newdelhi, July 28: కష్టాల్లో ఉన్నవారిని అదృష్టం రూపంలో ఆ దేవుడే (God) గట్టుకు చేరుస్తాడన్న విషయం మరోసారి రుజువైంది. కేరళకు (Kerala) చెందిన పదకొండు మంది మహిళలను అదృష్టం (Luck) అనూహ్యంగా వరించిన ఘటన ఇది. రాత్రికి రాత్రి వారందరూ లక్షాధికారులైపోయిన ఆనందభారిత క్షణమిది. రూ.250ల లాటరీ టిక్కెట్టును (Lottery Ticket) 11 మంది మహిళలు డబ్బులు పోగేసి మరీ కొనుక్కుని చివరకు రూ.10 కోట్లు గెలుచుకున్నారు. అసలు విషయం ఏంటంటే? కేరళలోని  పరప్పనన్‌ గడీ మున్సిపాలిటీకి చెందిన హరిత కర్మ సేనకు చెందిన కొందరు పేద మహిళలు స్థానికంగా నాన్ బయోడిగ్రేడబుల్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ ప్లాంట్‌ కు తరలిస్తుంటారు. అలా వచ్చే కొద్ది పాటి ఆదాయమే వారి జీవనాధారం.

Vande Bharat: ఇదేందయ్యా.. ఇది? చపాతీ ఆర్డరిస్తే.. బొద్దింక వచ్చింది.. ‘వందేభారత్‌’లో షాకింగ్ ఘటన.. వెంటనే స్పందించిన రైల్వే.. బాధితుడికి క్షమాపణలు.. కాంట్రాక్టర్‌ కు 25 వేల ఫైన్

కనీసం పాతిక రూపాయలు కూడా..

లాటరీ టికెట్ తో తమ అదృష్టం మారుతుందని ఆశపడే వాళ్లు. అయితే, టిక్కెట్టు కొనుగోలుకు వారి వద్ద కనీసం పాతిక రూపాయలు కూడా లేని పరిస్థితి. దీంతో, కొందరు అప్పు చేసి మరీ మొత్తం రూ.250తో ఓ లాటరీ టిక్కెట్టు కొనుక్కున్నారు. బుధవారం కేరళ లాటరీ డిపార్టుమెంటు లాటరీ నిర్వహించగా వీరికి రూ.10 కోట్ల విలువైన మాన‌సూన్ బంపర్ లాటరీ దక్కింది. దీంతో, ఆ మహిళల ఆనందానికి అంతేలేకుండా పోయింది. తాము జీవితంలో చాలా కష్టాలు పడుతున్నామని, ఈ డబ్బుతో కొంతమేర సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు.

Manipur Sexual Violence Case: సీబీఐ చేతికి మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపు కేసు, కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయం