IPL Auction 2025 Live

Indonesia Horror: ఇండోనేషియాలో ఘోరం.. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి.. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి దూసుకురావడంతో ఈ ఘటన

తూర్పు జావా ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Football (Photo Credits: Twitter)

Jakarta, October 2: ఇండోనేషియాలో (Indonesia) తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తూర్పు జావా (Eastern Java) ప్రావిన్సులోని ఫుట్‌బాల్ స్టేడియంలో (Football Stadium) జరిగిన తొక్కిసలాటలో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. 180 మంది తీవ్రంగా గాయపడ్డారు. అరేమా ఫుట్‌బాల్ క్లబ్-పెర్సెబయ సురబయ మధ్య గతరాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఇండోనేషియా పోలీసులు (Police) తెలిపారు. ఓడిపోయిన జట్టు అభిమానులు ఒక్కసారిగా మైదానంలోకి (Ground) దూసుకురావడంతో ఈ ఘటన జరిగింది. వారిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది.

గాంధీ జయంతి శుభాకాంక్షలు, మీ స్నేహితులు, సన్నిహితులకు వాట్సప్ ద్వారా విషెస్ తెలపాలని అనుకుంటున్నారా, అయితే ఫోటో సందేశాలు మీ కోసం..

మలాంగ్‌లో జరిగిన ఈ ఫుట్‌బాల్ మ్యాచ్ (Match) అనంతరం అభిమానులు మైదానంలోకి చొచ్చుకెళ్తున్న వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా చానళ్లు ప్రసారం చేశాయి. కాగా, ఈ మ్యాచ్‌లో పెర్సెబయ 3-2తో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం జరిగిన తొక్కిసలాటతో ఇండోనేషియాలోని ప్రముఖ లీగ్ అయిన బీఆర్ఐ లీగ్ 1.. వారం రోజులపాటు మ్యాచ్‌లను నిషేధించింది. మరోవైపు, ఈ తొక్కిసలాట ఘటనపై ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేషియా (పీఎస్ఎస్ఐ) విచారణకు ఆదేశించింది. కాగా, ఇండోనేషియాలో ఇలాంటి ఘటనలు ఇటీవల సర్వసాధారణంగా మారిపోయాయి.



సంబంధిత వార్తలు

IND vs AUS 1st Test 2024: పెర్త్‌ టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై భారీ గెలుపు, వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో నంబర్‌ వన్‌ స్థానానికి భారత్, రెండో స్థానానికి కంగారూలు

Nishadh Yusuf Dies: అనుమానాస్పద స్థితిలో విగత జీవిగా కనిపించిన స్టార్ ఎడిటర్, నిషాద్ యూసుఫ్ మృతిపై సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

ICC Women’s T20 World Cup 2024: మహిళల టి20 ప్రపంచకప్‌, సెమీస్‌లో స‌ఫారీ జ‌ట్టు గెలుపు గ‌ర్జ‌న, వ‌ర‌ల్డ్ క‌ప్ చ‌రిత్ర‌లో తొలిసారిగా కంగారులను ఇంటికి సాగనంపిన ఉమెన్ దక్షిణాఫ్రికన్లు, 8 వికెట్ల తేడాతో ఘన విజయం

Traffic Restrictions in Hyderabad: ఉప్ప‌ల్ వైపు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోక‌పోతే ట్రాఫిక్ లో చిక్కుకుంటారు, రెండో టీ-20 మ్యాచ్ సంద‌ర్భంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు