Hospital Power Cut: ప్రభుత్వ ఆసుపత్రిలో 5 రోజులుగా పవర్ కట్.. టార్చ్ లైట్లతోనే డాక్టర్ల చికిత్స.. ఛత్తీస్‌గఢ్‌లో ఘటన
ఈ నేపథ్యంలో మొబైల్ టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు.
Newdelhi, Oct 2: ప్రభుత్వ ఆసుపత్రిలో (Govt. Hospital) గత ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా (Hospital Power Cut) నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో మొబైల్ (Mobile) టార్చ్ లైట్ల వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు. ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన నేపథ్యంలో గత ఐదు రోజులుగా పవర్ కట్ నెలకొన్నది.
వెలుగులోకి ఇలా...
శుక్రవారం సాయంత్రం కిలేపాల్ లో లారీ, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా 18 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కరెంట్ లేకపోవడంతో గాయపడిన వారికి మొబైల్ టార్చ్ లైట్ వెలుగులో డాక్టర్లు చికిత్స అందించారు. ఐదు రోజులుగా ఆసుపత్రికి విద్యుత్ సరఫరా లేకపోవడంపై క్షతగాత్రుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.