Snake Bites in India: ప్రపంచంలో ఎక్కువ పాము కాట్లు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? మన దగ్గరే..! దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు.. ఇందులో ఏటా 50 వేల మంది మృతి.. కేంద్రం వెల్లడి

పాము కాటు వల్ల భారత్ లో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ సోమవారం లోక్‌ సభలో వెల్లడించారు.

Snake Bites in India

Newdelhi, July 30: దేశంలో పాము కాటు (Snake Bites in India) మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పాము కాటు వల్ల భారత్ లో ఏటా 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ (BJP) ఎంపీ రాజీవ్‌ ప్రతాప్‌ రూడీ సోమవారం లోక్‌ సభలో వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యధిక పాము కాట్లు కూడా మన దగ్గరే రికార్డు అవుతున్నట్టు పేర్కొన్నారు. దేశంలో ఏటా 30-40 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, దేశంలో పాము కాట్లు పెరుగడానికి గల కారణాలను కూడా ఎంపీ వెల్లడించారు.

కేరళలో తీవ్ర విషాదం.. కొండచరియలు విరిగిపడి ఏడుగురి మృతి.. మట్టిదిబ్బల కింద చిక్కుకున్న వందలాది మంది.. సహాయక చర్యలు ముమ్మరం

జార్ఖండ్‌ లో హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్‌ ప్రెస్ రైలుకు ప్రమాదం.. పట్టాలు తప్పిన 18 బోగీలు.. ఒకరు మృతి.. 60 మందికి గాయాలు

ఎందుకంటే?

వాతావరణ మార్పులు పాముకాట్లపై ప్రభావం చూపుతాయని ఆయన పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్‌ దాటి పెరిగితే ఈ ఘటనలు పెరుగుతాయని తెలిపారు.