Balcony for Rent: ఇచ్చట బాల్కనీ కిరాయికి ఇవ్వబడును.. అద్దె రూ.81 వేలు.. ఎక్కడంటే?

కానీ, ఎక్కడైనా బాల్కనీ అద్దెకు ఇవ్వడాన్ని చూశారా. కిరాయి కూడా రూ.81 వేలు అంటే నమ్మగలరా?

Balcony for Rent (Credits: X)

Sydney, July 8: ఫ్లాట్ (Flat), ఇండిపెండెంట్ హోమ్ లేదా పెంట్ హౌస్ రెంట్ కి ఇవ్వడం తెలుసు. కానీ, ఎక్కడైనా బాల్కనీ అద్దెకు ఇవ్వడాన్ని చూశారా. కిరాయి కూడా రూ.81 వేలు అంటే నమ్మగలరా? ప్రస్తుతం ఫేస్‌ బుక్‌ లో ఈ ప్రకటన తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సిడ్నీ(Sydney)లోని ఓ ఇంట్లోని బాల్కనీ అద్దెకు ఇస్తామంటూ సంబంధిత వ్యక్తి ఈ ప్రకటన ఇచ్చారు. ఈ బాల్కనీలో బెడ్‌ తో పాటు అద్దం కూడా ఉంది. మంచి వెలుతురు ఉందని యాడ్‌ లో చెప్పుకొచ్చారు. బాత్రూమ్ వంటివి గదిలోపల ఉంటాయని, వాడుకోవచ్చని చెప్పుకొచ్చారు. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు వంటివి అదనమని అన్నారు.

ఉచిత ఇసుక పాల‌సీ అమ‌లుకు రంగం సిద్ధం, ట‌న్నుకు రూ. 88 వ‌సూలు చేయ‌నున్న ప్ర‌భుత్వం

నెటిజన్ల రియాక్షన్ ఇదే!

ప్రస్తుతం ఈ యాడ్ తెగ వైరల్ అవుతున్నది. కేవలం బాల్కనీకి ఇంత అద్దా? అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇందులో కూడా దిగేవాళ్లు ఉంటారా? అని మరికొందరు ఆశ్చర్యపోయారు. బాల్కనీకి ఇంత రేటా? అని మరికొందరు కామెంట్ పెట్టారు. కాగా, సిడ్నీలో ఇటీవల కాలంలో ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి.

విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం క‌మిటీలు, సీఎస్ ల‌తో పాటూ అధికారుల‌తో క‌మిటీలు ఏర్పాటు, అక్క‌డ కూడా ప‌రిష్కారం కాక‌పోతే ముఖ్య‌మంత్రుల‌దే తుది నిర్ణయం