Snake Spotted Inside Plane: విమానం ఆకాశంలో ఉండగా బుస్ అంటూ పాము..ఒక్కసారిగా షాక్ తిన్న ప్రయాణికులు, వెంటనే దారి మళ్లించి ఫ్లైట్‌ని అత్యవసర ల్యాండ్ చేసిన పైలట్
ఫ్లైట్ లగేజ్ ర్యాక్ వద్ద పాము కనిపించడంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై పైలట్‌కు సమాచారం అందించారు. పాము వల్ల ఎవరికీ హానీ కలిగించొద్దనే ఉద్దేశంతో ఆ విమానాన్ని పైలట్ దారి మళ్లించాడు. ఎయిర్ ఏషియా విమానం కౌలలంపూర్ నుంచి మలేషియాలోని తవుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఆకాశంలో విమానం దూసుకెళ్తుండగా ఓ పాము విమానంలో హల్ చల్ చేసింది. ఫ్లైట్ లగేజ్ ర్యాక్ వద్ద పాము కనిపించడంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై పైలట్‌కు సమాచారం అందించారు. పాము వల్ల ఎవరికీ హానీ కలిగించొద్దనే ఉద్దేశంతో ఆ విమానాన్ని పైలట్ దారి మళ్లించాడు. ఎయిర్ ఏషియా విమానం కౌలలంపూర్ నుంచి మలేషియాలోని తవుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
విమానాన్ని కుచింగ్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి ల్యాండ్ చేశారు. అక్కడ పామును విమానం నుంచి బయటకు పంపించేశారు. అయితే విమానంలోకి పాము ఎలా ప్రవేశించిందనే అంశంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. లగేజ్ బ్యాగులో నుంచి పాము వచ్చిందా? లేక విమానం ల్యాండైన సమయంలో నేరుగా పాము ప్రవేశించిందా? అనే విషయం తేలాల్సి ఉంది. ఈ వీడియోను పైలట్ హనా మోహ్‌సిన్ ఖాన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు.