‘Most Dramatic Video’: ముంబై వర్ష విలయాన్ని తెలిపే భయానక వీడియో, సోషల్‌మీడియాలో వైరల్ అవుతోన్న ఆనంద్ మహీద్రా ట్వీట్, ఆర్థిక రాజధానిని వణికిస్తున్న వర్షాలు

దేశ ఆర్థిక రాజధానిని ఓ వైపు కరోనా భయపెడుతుంటే మరోవైపు వర్ష భీబత్సంతో (Mumbai Rains) ముంబై నగరం చిగురుటాకుల వణికిపోతోంది. భారీ వర్షాలు ముంబై మహానగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గంటకు 107 ఏళ్ల మైళ్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇంటి పైకప్పులతో పాటు భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే గుండెలు ఝళదరించేలా ఉన్నాయి.

Traffic movement at waterlogged Kurla Road after heavy monsoon rain in Mumbai (Photo: ANI)

Mumbai, August 6: దేశ ఆర్థిక రాజధానిని ఓ వైపు కరోనా భయపెడుతుంటే మరోవైపు వర్ష భీబత్సంతో (Mumbai Rains) ముంబై నగరం చిగురుటాకుల వణికిపోతోంది. భారీ వర్షాలు ముంబై మహానగర ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గంటకు 107 ఏళ్ల మైళ్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇంటి పైకప్పులతో పాటు భారీ వృక్షాలు సైతం నేలకొరుగుతున్నాయి. సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుంటే గుండెలు ఝళదరించేలా ఉన్నాయి.

ఇదిలా ఉంటే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా (Anand Mahindra) ముంబై భారీ వర్షాలపై ట్విటర్‌లో స్పందించారు బలంగా వీస్తున్నగాలులకు ఒక ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టు అటూ ఇటూ ఊగడం చూస్తే నాకు అవి డ్యాన్స్‌ చేసినట్లుగా కనిపించాయి. గాలి బీభత్సం చూస్తే.. ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే జరగుతాయనిపించింది. మొత్తానికి ముంబైని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నెటిజన్లు షేర్‌ చేసిన అన్ని వీడియోల్లో ఇది మోస్ట్‌ డ్రామాటిక్‌ వీడియోగా (Most Dramatic Video) నిలిచింది.' అంటూ కామెంట్‌ చేశారు. ప్రస్తుతం మహీంద్రా కామెంట్స్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వైపు కరోనా..మరోవైపు వర్ష విలయం, విలవిలలాడుతున్న ముంబై, 46 ఏళ్ల తర్వాత కొలాబాలో అత్యధిక వర్షపాతం, రెండు రోజుల పాటు రెడ్ అలర్ట్

Here's Anand mahindra Tweet

చాలామంది నెటిజన్లు ముంబైని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేశారు. ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. నగరంలో ప్రజారవాణా సేవలు అన్ని స్తంభించాయి. ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడ నిలిచిపోయింది. వర్షాలు అధికంగా కురుస్తుండటంలో ముంబై, పుణెలో రెడ్‌అలర్ట్‌ కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ సూచించింది.

Here's Some Videos on Mumbai Rains

అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాతావరణ శాఖ 12 గంటల్లో 293.8 మిల్లీమీటర్ల వర్షాన్ని రికార్డు చేసింది. 1974 తర్వాత ముంబైలో 24 గంటల వ్యవధిలో ఆగస్టు నెలలో అత్యధిక వర్షపాతం నమోదయినట్టు అధికారులు తెలిపారు. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now