Viral Video: మీద నుంచి ట్రైన్ వెళ్లినా కూడా బతికి బయటపడ్డాడు, అడ్డదిడ్డంగా పట్టాలు దాటుతున్న వాళ్లు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది!

ఆ వ్యక్తి ఏ మాత్రం కంగారు పడలేదు, అస్సలు భయపడలేదు. కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. రైలు కింద పట్టాల మధ్య అలానే పడుకుని ఉండిపోయాడు. దీంతో రైలు అతడి మీది నుంచి వెళ్లినా అతడికి చిన్న గాయం కూడా కాలేదు. అదృష్టవశాత్తు అతడు చావు నుంచి బయటపడ్డాడు. రైలు వెళ్లిపోయాక అతగాడు.. తన బ్యాగ్ తీసుకుని అసలేమీ జరగనట్లు అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోవడం గమనార్హం.

Bhagalpur, NOV 12:  యమలోకం ఎంట్రెన్స్ వరకు వెళ్లి రావడం అంటే వినే ఉంటారు. కానీ ఈ వీడియో చూస్తే మాత్రం అతను నిజంగానే యమలోకపు అంచుల వరకు వెళ్లి వచ్చినంత పని అయింది. బీహార్‌లోని కహాల్‌గావ్‌ ఓ రైల్వే స్టేషన్‌ లో (Bhagalpur Railway Station) పట్టాలు దాటేందుకు షార్ట్ కట్ వాడి ప్రమాదపు అంచుల్లోకి వెళ్లాడు. అయితే భూమి మీద నూకలు మిగిలే ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డాడు. పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా ట్రైన్ వచ్చింది. అయితే సమయస్పూర్తితో వ్యహరించడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. వివరాల్లోకి వెళితే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్​ మీడియాలో (Social Media) హల్​చల్​ చేస్తోంది. ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్ మారేందుకు.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. రైలు పట్టాలపై దాటే ప్రయత్నం చేశాడు. ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్​ రైలు కింద నుంచి పట్టాలు​ దాటేందుకు యత్నించాడు. అయితే, అనుకోకుండా ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో ఆ వ్యక్తి రైలు కింద చిక్కుకుపోయాడు. అంతా ఆ వ్యక్తి చనిపోయాడనే అనుకున్నారు. కానీ, రైలు వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి హ్యాపీగా నడుచుకుంటూ బయటికి రావడంతో అంతా విస్తుపోయారు. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఒక్కసారిగా రైలు కదలినా.. ఆ వ్యక్తి ఏ మాత్రం కంగారు పడలేదు, అస్సలు భయపడలేదు. కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. రైలు కింద పట్టాల మధ్య అలానే పడుకుని ఉండిపోయాడు. దీంతో రైలు అతడి మీది నుంచి వెళ్లినా అతడికి చిన్న గాయం కూడా కాలేదు. అదృష్టవశాత్తు అతడు చావు నుంచి బయటపడ్డాడు. రైలు వెళ్లిపోయాక అతగాడు.. తన బ్యాగ్ తీసుకుని అసలేమీ జరగనట్లు అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోవడం గమనార్హం.

Karnataka: నాడప్రభు కెంపేగౌడ 108 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ, స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పిరిటీగా నామకరణం 

బీహార్ లోని భగల్ పుర్ పరిధిలోని కహల్ గావ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది. గూడ్స్ రైలు అతని మీదుగా వెళ్లడం చూసిన చుట్టుపక్కల వాళ్లు అతడి ప్రాణాల గురించి ఆందోళనకు గురయ్యారు. లేవద్దు, కదలొద్దు అంటూ కేకలు వేస్తూ హెచ్చరించారు. తీరా రైలు అతడి మీద నుంచి వెళ్లినా, అతడు క్షేమంగా బయటపడటంతో అంతా రిలాక్స్ అయ్యారు.