Bihar: పెళ్లి వద్దంటూ పరుగులు పెట్టిన వరుడు, పెళ్లి చేసుకోవాల్సిందేనని వెంబడించి మరీ పట్టుకున్న వధువు, పోలీస్ స్టేషన్ కి చేరిన వ్యవహారం, చివరకు ముగిసిన పెళ్లి తంతు
వరుడి వెంట వధువులు పరుగులు పెడుతున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి
Patna, August 30: బిహార్‌లోని నవాడా ఏరియాలోని భగత్ సింగ్ చౌక్ ప్రాంతంలో పెళ్లి వద్దు బాబోయ్ అంటూ పరారైన ఓ వరుడిని వధువు వెంబడించి ( Woman Runs After Groom On Road) పట్టుకుంది. వరుడి వెంట వధువులు పరుగులు పెడుతున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వీరిద్దిరకీ మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. ఆ సమయంలో వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్ ఇచ్చారు.
అయితే ఈ పెళ్లి వరుడికి నచ్చలేదో లేక మరేదైనా కారణమో తెలియదు కాని వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు.తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో విసుగొచ్చిన వధువు తరపు వారు యువకుడి ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి పరారయ్యేందుకు (He Refuses To Marry) ప్రయత్నించాడు. దీంతో వధువు.. అతడిని వెంబడించింది. తగ్గేదేలే అంటూ ఛేజింగ్ చేసి మరీ పట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది.
Here's Video
అయినా.. ఒప్పుకోకపోవటంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. చివరకు వధువును పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు యువకుడు. దీంతో ఆ పోలీస్ స్టేషన్‌కు సమీపంలోని ఓ గుడిలో ఇద్దరికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు.