ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది.రైలు కింద పడి ముక్కలు ముక్కలు అయింది ఓ వ్యక్తి బైక్‌. ఆ వ్యక్తి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.వైరల్ అవుతున్న వీడియో ప్రకారం..బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్‌ వద్ద ట్రాక్‌ దాటేందుకు ప్రయత్నించాడు. గేటు వేసి ఉన్నా పట్టాలపైకి బైక్‌తో వెళ్లాడు. అయితే.. అవతలి ట్రాక్‌పై ఓ రైలు వెళ్తుండటంతో ఈ వైపు ఉన్న పట్టాలపై వేచి ఉన్నాడు.

అప్పుడే మరో రైలు ఆ వ్యక్తి ఉన్న పట్టాలపై దూసుకొస్తోంది. అది గమనించిన సదరు వ్యక్తి బండిని వెనక్కి తిప్పే క్రమంలో పట్టాల మధ్యలో పడిపోయింది. దానిని లాగేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేదు. అక్కడే వదిలేసి వెనక్కి పరిగెట్టాడు. క్షణాల వ్యవధిలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. ద్విచక్రవాహనంపై నుంచి వెళ్లింది. బైక్‌ తునాతునకలైంది. ఆగస్టు 26న జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. రైల్వే పోలీసులు బైక్‌ యజమానిపై కేసు నమోదు చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)