Tamil Nadu Horror: బైకర్ ర్యాష్ డ్రైవింగ్.. 20 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డ స్టూడెంట్.. తమిళనాడులో ఘటన

ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూరులో చోటు చేసుకుంది.

Road Accident (Representational Image)

Newdelhi, Oct 24: ఓ యువ‌కుడు ర్యాష్ డ్రైవింగ్ (Rash Driving) చేయ‌డంతో స్కూల్ విద్యార్థి (School Student) 20 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని (Tamilnadu) కోయంబ‌త్తూరులో చోటు చేసుకుంది. కోయంబ‌త్తూరులోని అభిరామి థియేట‌ర్ వ‌ద్ద ఓ స్కూల్ స్టూడెంట్ రోడ్డు దాటుతున్నాడు. అదే స‌మ‌యంలో ఓ బ‌స్సు వ‌చ్చింది. అయితే బై క్‌ను గ‌మ‌నించని స్టూడెంట్.. బ‌స్సు వ‌చ్చే లోపు వేగంగా ముందుకు క‌దిలాడు. బ‌స్సును ఓవ‌ర్ టేక్ చేస్తూ స్పీడ్‌గా వ‌చ్చిన బైక్‌.. ఆ విద్యార్థిని ఢీకొట్టింది. దీంతో స్టూడెంట్ 20 అడుగుల దూరంలో ఎగిరిప‌డ్డాడు.ఈ ఘ‌ట‌న‌లో బాలుడికి తీవ్ర గాయాల‌య్యాయి. ప్ర‌స్తుతం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

Bihar Horror: బీహార్ లో దారుణం.. దుర్గా పూజా వేడుక‌ల్లో తొక్కిస‌లాట.. మూడేండ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి

బైకర్ పరిస్థితి?

ఇక బైక్ రైడ‌ర్‌ కు ఎలాంటి గాయాలు కాలేదు. నిర్ల‌క్ష్యంగా బైక్ న‌డిపిన యువ‌కుడిని న‌జీర్‌ గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు న‌జీర్‌ ను అరెస్టు చేసి, బైక్‌ను సీజ్ చేశారు. ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

Winter Season: తెలంగాణలో మొదలైన చలి పంజా.. త‌గ్గుముఖం ప‌ట్టిన ఉష్ణోగ్ర‌త‌లు.. ఆదిలాబాద్‌ లో 17.2 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌ నమోదు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif