Single Resident: పెద్ద భవనం అది. 127 ఫ్లాట్స్ ఉన్నాయి. అందర్నీ ఖాళీ చేయించారు. అయినా, ఒక్కడు మాత్రం అలాగే ఒంటరిగా ఉన్నాడు. ఏంటా సంగతి?

ఏకంగా 127 ఫ్లాట్స్ ఉన్నాయి. అందర్నీ ఖాళీ చేయించారు. అయినా, ఒక్కడు మాత్రం అలాగే ఒంటరిగా ఉన్నాడు. ఏంటా సంగతి?

Nick Wisniewsk (Photo Credit: SWNS)

London, August 13: పాడుబడి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాల నుంచి నివాసితులను వెళ్లిపోమ్మని చెప్పి సదరు బిల్డర్లు ఎంతో కొంత డబ్బులు చెల్లించడం చూస్తూనే ఉంటాం. అలానే బ్రిటన్‌(Britain)లోని స్కాట్లాండ్‌లో ఓ భవనాన్ని కూల్చేయలనుకున్నారు. అందుకోసం నివాసితులను ఖాళీ (Vacate) చేయించారు కూడా. కానీ ఒకే ఒక్కడు (Single Person) మాత్రం ఆ భవనాన్ని ఖాళీ చేసి వెళ్లటం లేదు. వివరాల్లోకి వెళ్తే.. నార్త్‌ లానార్క్‌షైర్‌ కౌన్సిల్‌లో ఒక బహుళ అంతస్తుల భవనం ఉంది. అందులో ఏకంగా 127 ఫ్లాట్లు (Flats) ఉన్నాయి. అయితే నగరానికి దూరంగా ఉండటం, పెద్ద పెద్ద గాలులకు అద్దలు పగిలిపోవడం, దొంగల భయం వంటి ఫిర్యాదులు రావడంతో ఆ భవనాన్ని కూల్చివేయాలని కౌన్సిల్‌ నిర్ణయించింది. దీంతో ఆ భవనంలోని నివాసితులందర్నీ ఖాళీ చేయించారు. ఐతే నిక్‌ విస్నీవ్సీక్‌ అనే వ్యక్తి మాత్రం ససేమిరా ఖాళీ చేయనని చెప్పేశాడు. పైగా అతనొక్కడే ఒంటరిగా (Lonely) ఉంటున్నాడు.

ఈ తరహా విమానం ల్యాండింగ్ ఎప్పుడూ చూసి ఉండరు. మనుషులను తాకడమే మిగిలింది మరి.. నెట్టింట్లో వీడియో వైరల్

ఆఖరికి కౌన్సిల్‌ అతనకి సుమారు రూ. 34 లక్షలు తోపాటు మరోచోట అద్దెకున్నందుకు (Rent) అక్కడ అద్దెను కూడా చెల్లిస్తామని మంచి ఆఫర్‌ కూడా ఇచ్చింది. అయినా కుదరదని నిక్‌ తెగేసి చెప్పేశాడు. దీంతో కౌన్సిల్‌ అతను వెళ్లిపోవాలని ఆ భవనం శుభ్రం చేయకుండా, సెక్యూరిటీని తీసేసి, పట్టించుకోకుండా వదిలేసింది. అయినా అతను తన ప్లాట్‌ని వదిలి వెళ్లనని చెబుతున్నాడు. అతనికి ఆ బిల్డింగ్ అంటే అంతిష్టం ఎందుకో.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా  నిక్‌.. రైట్‌ టు బై స్కీమ్‌ (Scheme) కింద ఆ ఫ్లాట్‌ని 2017లో కొనుక్కున్నాడు.



సంబంధిత వార్తలు

AI Death Calculator: మనం ఎప్పుడు మరణిస్తామో ఇట్టే చెప్పేసే ‘డెత్ కాలిక్యులేటర్‌’.. బ్రిటన్‌ లో మెషీన్ ను వాడేందుకు సిద్ధమవుతున్న హాస్పిటళ్లు.. అసలు ఎలా పనిచేస్తుందంటే?

World's Oldest Person Dies: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కన్నుమూత, ఆమె మృతికి సంతాపం తెలిపిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్, 117 ఏళ్ల వయసులో మరణించిన మరియా బ్రాన్యాస్

Train Guard Manhandles Disabled Person: దివ్యాంగుడి ట్రైన్ నుంచి తోసేసిన గార్డ్, సూప‌ర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినందుకు క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తి, బీహార్ లో వైర‌ల్ గా మారిన వీడియో

Hyderabad Horror: కొత్తపేటలో అర్థరాత్రి గంజాయి బ్యాచ్ హల్ చల్, ఇదేం పని అని అడిగిన వ్యక్తిపై కర్రలతో, రాళ్లతో దాడి, అందరినీ అరెస్ట్ చేశామని తెలిపిన సరూర్ నగర్ SHO, వీడియో ఇదిగో..