Elon Musk reaches record $500 billion net worth(X)

Delhi, December 18:  టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తరువాత మస్క్ సంపాదన రోజురోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజుల క్రితం 439.2 బిలియన్ డాలర్లకు పెరిగిన మస్క్ సంపాదన తాజాగా 500 బిలియన్ డాలర్లకు చేరింది. ఒక్క వారంలోనే 100 బిలియన్ డాలర్ల సంపద పెరుగగా మొత్తంగా ఈ ఏడాది ఎలాన్ మస్క్ సంపద 107శాతానికి పైగా పెరిగింది.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇంత సంపదను సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచాడు మస్క్. ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల తయారీ సంస్థ టెస్టాకు మస్క్ సీఈవో. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ బ్యాటరీలను విక్రయిస్తుంది ఈ కంపెనీ.  భూకంపం వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి, వనాటు తీరంలో వచ్చిన భూకంపానికి కార్లు ఎలా ఊగుతున్నాయంటే..

అదేవిధంగా స్పేస్ఎక్స్ యజమాని కూడా. నాసాతో స్పేస్ఎక్స్ ఒప్పందం కలిగి ఉంది. సోషల్ మీడియా ఎక్స్ (ట్విటర్) యాజమాని.అలాగే న్యూరాలింక్, ఎక్స్ఏఐ, బోరింగ్ కంపెనీలను కలిగిఉన్నాడు మస్క్.

2022లో $44 బిలియన్లకు X కార్ప్‌ను కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ 79% వాటాను కలిగి ఉంటారని అంచనా. ప్రపంచంలోనే అత్యంత విలువైన కార్ల తయారీదారుగా తన కంపెనీని నిలిపాడు మస్క్.