Tokyo, Jan 5: ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన 116 ఏండ్ల జపాన్ మహిళ టోమికో ఇతోకా మృతి చెందారు. ఈ మేరకు శనివారం అధికారులు ప్రకటించారు. ఆషియాలో నివసించే టోమికోకు నలుగురు పిల్లలు, ఐదుగురు మనవలు ఉన్నారు. డిసెంబర్ 29న ఆమె ఒక నర్సింగ్ హోమ్ లో చికిత్స పొందుతూ మరణించారని ఆ నగర మేయర్ తెలిపారు. 12.4 కోట్ల జనాభా ఉన్న జపాన్ లో మూడో వంతు 65 అంత కన్నా ఎక్కువ వయసున్న వృద్ధులే ఉన్నారన్న విషయం తెలిసిందే.
Sad news today that the world's oldest person Tomiko Itooka has died at the age of 116. Our thoughts are with her family.https://t.co/2UNvdrGFse
— Guinness World Records (@GWR) January 4, 2025
ఆమెకు 117 ఏండ్లు.. అయితే,
స్పెయిన్‌కు చెందిన 117 ఏండ్ల బ్రన్యాస్ మోరియా గత ఏడాది ఆగస్టులో మరణించిన తర్వాత ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ మహిళగా టోమికో నిలిచింది.