TGSRTC Bus (Photo-Video Grab)

Hyderabad, Jan 5: సంక్రాంతి పండుగ (Sankranti Festival) సందర్భంగా సొంతూళ్ళకు వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్. పెద్ద పండుగ కోసం తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) 6,432 ప్రత్యేక బస్సులను (Special Buses) నడపనుంది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. కాగా, పండుగ సమయంలో బస్సుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంటుందా? లేదా? అనే విషయంపై సర్వత్రా అనుమానాలు ఉన్నాయి తాజాగా వీటిపై టీజీఎస్ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు.

రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు పెట్టుబడి సాయం, రేషన్‌ కార్డులపై కేబినెట్ భేటీలో నిర్ణయం

ఫ్రీ బస్సుపై ఇలా..

సంక్రాంతి పండుగ రోజుల్లో పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ ప్రెస్ బస్సుల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమల్లో ఉంటుందని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపింది. రోజువారీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండబోదని మరోసారి గుర్తుచేసింది.

నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం, పోలవరం నిర్మాణం - భద్రాచలం ముంపుపై కీలక ఆదేశాలు