CM Revanth Reddy key review on irrigation Department

Hyd, January 4:  సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణపై పడే ప్రభావంపై ఐఐటీ హైదరాబాద్ టీమ్‌తో నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయించాల‌ని సీఎం ఆదేశించారు. ఐఐటీ హైదరాబాద్ టీమ్‌తో కో-ఆర్డినేషన్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.

పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్ప‌డే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సీఎంకి వివరించారు అధికారులు. ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బన‌కచర్ల ప్రాజెక్టు అంశాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకొచ్చారు అధికారులు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుతో పాటు కేంద్ర జల్‌ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.