Vijayawada Rains: జలదిగ్బంధంలో విజయవాడ.. గడిచిన 20 ఏండ్లలో ఎన్నడూ చూడనంత వర్షం.. ఆరుగురు మృతి.. నీటిలో తేలియాడుతున్న బస్సులు (వీడియో)

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

Buses submerged at Vijayawada (Credits: X)

Vijayawada, Sep 1: విజయవాడలో (Vijayawada) భారీవర్షం విళయం సృష్టిస్తున్నది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో (Rains) నగరం అతలాకుతలమైంది. ఒక పక్క కుండపోత వర్షం మరోవైపు పొంగిన రోడ్లు జలమయమైన రహదారులుతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు తటాకాలను తలపిస్తున్నాయి. గత 20 ఏళ్ల చరిత్రలో ఎన్నడూలేనంతగా బెజవాడ నగరం బెంబేలెత్తింది. మొగల్రాజపురం సున్నపుబట్టీల సెంటర్‌ వద్ద కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు.

భారీ వర్షానికి ధ్వంసమైన రైల్వే ట్రాక్.. రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన.. నిలిచిపోయిన పలు రైళ్లు (వీడియో)

నీటిలో బస్సులు

విజయవాడలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి. కార్లు, బస్సులు రహదారులపై నిలిచిన వరదలో చిక్కుకుపోయి మొరాయించాయి. ఇక ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అండర్‌ గ్రౌండ్‌ వంతెనలు నీటితో నిండిపోయాయి. విజయవాడ నగరం జలదిగ్బంధంలో ఉండటంతో బస్సు సర్వీసులు రద్దయ్యాయి.  ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, సహా లారీలు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. బస్టాండ్ నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

హైదరాబాద్ ను ముంచెత్తిన వాన.. తెలంగాణలో మరో 6 రోజులపాటు వర్షాలు.. నేడు, రేపు రెడ్ అలర్ట్.. హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటన



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif