California Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం, కాలిఫోర్నియాలో ఘటన, సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు పైలెట్లు, వైరల్‌గా మారిన వీడియో

హైవేపై తేలికపాటి విమానం కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. కాలిఫోర్నియాలోని 91 ఫ్రీవే (91 Freeway)పై ఈ ప్రమాదం జరిగింది.

California, AUG 11: కాలిఫోర్నియాలో విమాన ప్రమాదం (California plane crash) జరిగింది. హైవేపై తేలికపాటి విమానం కుప్పకూలింది. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. విమానంలోని ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. కాలిఫోర్నియాలోని 91 ఫ్రీవే (91 Freeway)పై ఈ ప్రమాదం జరిగింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య(engine malfunction) కారణంగా ఒక్కసారి కుప్పకూలినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇంజిన్‌లో లోపంతో ఒక్కసారిగా కుప్పకూలిన విమానం...హైవేపై ట్రక్కును ఢీకొట్టింది. ఆ సమయంలో ఫ్లైట్‌ లో ఉన్న ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by KTLA 5 News (@ktla5news)

 

ట్రక్కును విమానం ఢీకొనడంతో ముక్కలు, ముక్కలైంది. ఈ ఘటనలో ట్రక్కు కూడా ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై పలు కార్లు, వాహనాలు వెళ్తున్నాయి. ఒక్కసారిగా పై నుంచి విమానం కింద పడటంతో వాహనదారులు షాక్ అయ్యారు. ఎక్కడికక్కడ నిలిచిపోయారు.  విమానం ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రమాదం కారణంగా ఫ్రీఏ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.



సంబంధిత వార్తలు