Cancer Agents In Cakes: బర్త్ డే నాడు కేకులను కూడా తిననిచ్చేలా లేరు కదా.. చివరకు కేక్స్ లో కూడా క్యాన్సర్‌ కారకాలు

చివరకు బర్త్ డే కేక్స్ కూడా కల్తీకి గురవుతున్నాయి. ఎంతలా అంటే క్యాన్సర్ వచ్చేంతలా. కర్ణాటక రాజధాని బెంగళూరులో 12 కేక్‌ శాంపిళ్లలో క్యాన్సర్‌ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం అధికారులు ప్రకటించారు.

Cancer representational image (Photo Credits : Pixabay)

Bengaluru, Oct 4: కాదేదీ కల్తీకి అనర్హం అనేలా తయారైంది నేటి కల్తీ రాయుళ్ల దందా. చివరకు బర్త్ డే కేక్స్ (Cakes) కూడా కల్తీకి గురవుతున్నాయి. ఎంతలా అంటే క్యాన్సర్ (Cancer) వచ్చేంతలా. కర్ణాటక రాజధాని బెంగళూరులో 12 కేక్‌ శాంపిళ్లలో క్యాన్సర్‌ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం అధికారులు ప్రకటించారు. మొత్తం 235 శాంపిళ్లను సేకరించగా అందులో 12 కేక్‌ లలో కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. రంగుల వాడకం క్యాన్సర్‌ కారకంగా పని చేయడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని హెచ్చరించారు.

మంత్రాల నెపంతో మహిళ సజీవ దహనం.. మెదక్ జిల్లా రామాయంపేటలో ఘటన (వీడియో)

వీటితో జాగ్రత్త

రెడ్‌ వెల్వెట్‌, బ్లాక్‌ ఫారెస్ట్‌ లాంటి కేక్‌ లలో తరచూ ఇలాంటి కృత్రిమ రంగులను కలుపుతున్నారని అధికారులు చెప్తున్నారు. అల్లూరా రెడ్‌, సన్‌ ఫెస్ట్‌ యెల్లో ఏసీఎఫ్‌, పొన్‌సియూ 4ఆర్‌, టార్టాజైన్‌, కెర్మోసైన్‌ తదితర కృత్రిమ రంగుల వాడకంలో భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించారు.

నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు... రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు.. ప్రైవేటు వాహనాలపై ఆంక్షలు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif