Car Accident in Hyderabad: హైదరాబాద్ బంజారాహిల్స్‌ లో కారు బీభత్సం.. యాక్సిడెంట్ జరగ్గానే డ్రైవర్ పరారీ (వీడియో)

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Car Accident in Hyderabad (Credits: X)

Hyderabad, Nov 19: హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం ఉదయం ఓ కారు బీభత్సం (Car Accident) సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 రోడ్డులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్ట నుంచి బంజారాహిల్స్ రోడ్డు వైపు వెళ్తుండగా డివైడర్ మీదకు దూసుకువెళ్ళి కరెంట్ ఫోల్ ను ఈ కారు ఢీ కొట్టింది. TS07UM1936 టాటా జీబ్రా కారు నడుపుతున్న డ్రైవర్ నిద్ర మత్తులోకి వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నారు.

తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం, శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసిన టీటీడీ, పాలక మండలి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవిగో..

Here's Video:

డ్రైవర్ పరారీ

ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ స్టేషన్‌ నుంచి పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన కారును సాఫ్ట్‌ వేర్‌ కంపెనీ ఉద్యోగులను పిక్‌ డ్రాప్‌ చేసే కారుగా గుర్తించారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 20 గంటలు.. రేపు వీఐపీ దర్శనాలు రద్దు



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif