Cold Wave in Telangana: తెలంగాణపై చలిపంజా.. భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 6.3 డిగ్రీలుగా నమోదు.. 12 జిల్లాల్లో సింగిల్ డిజిట్
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
Hyderabad, Dec 16: తెలంగాణపై (Telangana) చలిపంజా (Cold wave) విసురుతున్నది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 6.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణశాఖ వెల్లడించింది. ఏజెన్సీ ప్రాంతాలు సహా 12 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
జాకీర్ హుస్సేన్ ఇకలేరు, గుండె సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మరణించిన మ్యూజిక్ లెజెండ్
పలు ప్రాంతాల్లో అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు ఇలా..
- నిర్మల్ జిల్లా తాండ్ర-6.6 డిగ్రీలు
- కుమ్రంభీం ఆసిఫాబాద్-6.7 డిగ్రీలు
- సంగారెడ్డి-6.8 డిగ్రీలు
- హైదరాబాద్ హెచ్ సీయూ –7.1 డిగ్రీలు
- కామారెడ్డి-7.6 డిగ్రీలు
- నిజామాబాద్-7.7 డిగ్రీలు
- మెదక్-8 డిగ్రీలు
- జగిత్యాల-8 డిగ్రీలు
- వికారాబాద్-8.2 డిగ్రీలు
- రాజన్నసిరిసిల్ల-8.6 డిగ్రీలు
- సిద్దిపేట-8.6 డిగ్రీలు
- రంగారెడ్డి-8.9 డిగ్రీలు
- పెద్దపల్లి-9.5 డిగ్రీలు