Breathing Tree: లైవ్ లో గాలిని పీల్చుతున్న చెట్టు.. సినిమా గ్రాఫిక్స్ కాదు. నిజం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో..

అయితే, ఎప్పుడైనా లైవ్ లో చూశారా? కెనడాలో ఇలాంటి ఘటనే జరిగింది.

Breathing Tree

Ottawa, August 10: చెట్లకు (Trees) ప్రాణం ఉందని, అవి కూడా గాలిని పీల్చుకొని వదిలిపెడతాయని చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాం. అయితే, చెట్లు గాలిని పీల్చుకుంటున్నట్టు ఎప్పుడూ చూడలేదు. అయితే, కెనడాలోని ఓ చెట్టు మాత్రం మనిషిలాగే గాలి పీల్చుతుంది. నిజం.. వివరాల్లోకెళ్తే...కెనడా(Canada)లో కాల్గరీలో ఇటీవల  గంటకు 70 కిమీ వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు వచ్చాయి. ఆ విపత్తు అనంతరం ఒక వ్యక్తి ఏదైనా చెట్టు పడిపోయే స్థితిలో ప్రమాదకరంగా ఉందా? అని చెక్‌ చేయడానికి అడవిలోకి వచ్చినప్పుడూ ఓ వింత చూశాడు.

ప్రేయసిపై ప్రియుడి కక్ష.. కారుతో తొక్కించి హత్య.. రక్తం ఏరులై పారినా.. అవయవాలు చెల్లాచెదురుగా పడినా.. అలాగే పలుమార్లు కారును ఎక్కించిన దుర్మార్గుడు..

ఓ చెట్టు పెద్దగా పగ్గుళ్లు వచ్చి గాలి వీచినప్పుడల్లా గాలి పీల్చుకుంటున్నట్లు ఉందని వివరించాడు. అంతేకాదు ఆ ఘటనను వీడియో తీసి సోషల్‌ మీడియా (Socialmedia)లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ (Internet) ను షేక్ (Shake) చేస్తుంది. మీరూ ఆ వీడియో (Video) చూడండి..