Maha Shivratri Week Movies- OTT Releases: హనుమాన్ ఓటీటీపై తాజా అప్‌డేట్ ఏమిటి, విశ్వక్ సేన్ గామి, గోపిచంద్ భీమా రివ్యూలు ఎలా ఉన్నాయి, శివరాత్రి సందర్భంగా ఈవారం కొత్త చిత్రాల విశేషాలు తెలుసుకోండి!
This Week Movies- OTT Releases | Pixabay/file

Maha Shivratri Week Movies- OTT Releases: ఎప్పట్లాగే ఈవారం కూడా మరిన్ని కొత్త సినిమాలు మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాయి. శివరాత్రి పండగ సందర్భంగా మార్చి 8, 2024న థియేటర్లలో విడుదలైన సినిమాలు, క్లుప్తంగా వాటి రివ్యూలు, అలాగే ఈరోజు నుంచి వివిధ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉండనున్న సినిమాలు, వెబ్ సిరీస్‌ల వివరాలు, రాబోయే చిత్రాల విశేషాలను ఇక్కడ తెలియజేస్తున్నాం.

ఈవారం థియేటర్లలో రిలీజైన సినిమాల్లో విశ్వక్ సేన్ నటించిన 'గామి', చాలా రోజుల తర్వాత గోపిచంద్ నటించిన 'భీమా' వంటి సినిమాలు ట్రెండింగ్ లో ఉన్నాయి. మిగతావి చాలా వరకు చిన్న సినిమాలు, మిగిలిపోయిన సినిమాలు రిలీజ్ అయ్యాయి. శుక్రవారం శివరాత్రి పర్వదినం జరుపుకుంటున్న నేపథ్యంలో జాగరణ నిమిత్తం కొన్ని పాత సినిమాలు రీరిలీజ్ కూడా అయ్యాయి.

కాబట్టి ఈవారం సినిమాల వినోదానికి ఏ మాత్రం కొదువ లేదు. ఈ వారానికి గానూ సరికొత్త చలనచిత్రాలు, తాజా వెబ్ సిరీస్‌ల జాబితా ఈ కింద చూడండి.

ఈవారం థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలు

గామి (తెలుగు): విశ్వక్ సేన్, చాందినీ చౌదరి తదితరులు నటించిన అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా కథ, కథనం బాగుంది, కానీ సెకండాఫ్ కథనం నెమ్మదిగా సాగుతుంది అని చాలా మంది రివ్యూలు ఇస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూసే వారికి మంచి సినిమా చూసిన సంతృప్తి కలుగుతుందని టాక్ వచ్చింది.

భీమా (తెలుగు): గోపిచంద్, ప్రియా భవాని, మాళవిక శర్మ తదితరులు నటించిన యాక్షన్ డ్రామా చిత్రం ఇది. పోలీస్ అధికారిగా ప్లాష్ బ్యాక్ ట్విస్టులతో సాగే ఈ సినిమా ద్వితీయార్థం బాగుంది, ప్రథమార్థం నెమ్మదిగా ఉంది, మొత్తంగా సినిమా యావరేజ్ అని రివ్యూలు వచ్చాయి.

ప్రేమలు (మళయాలం డబ్బింగ్):  గతనెల మళయాలంలో విడుదలై హిట్ టాక్ సొంత చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. హైదరాబాద్ సిటీకి కోచింగ్ కోసం వచ్చిన మళయాలీ జంటల మధ్య నడిచే లవ్ స్టోరి ఈ చిత్రం.

బాబు నెం.1 బుల్ షిట్ గాయ్ (తెలుగు): అర్జున్ కళ్యాణ్, కిషిత తదితరులు నటించిన కామెడీ డ్రామా.. ఒకసారి చూడొచ్చు.

వీటితో పాటు వీ లవ్ బ్యాడ్ బాయ్స్, రికార్డ్ బ్రేక్, బుల్లెట్, రాజుగారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి వంటి సినిమాలు థియేటర్ల వద్దకు వచ్చాయి. షైతాన్, తేరా క్యా హోగా లవ్లీ వంటి హిందీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఈవారం నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'హనుమాన్' (Hanu-Man) సినిమా ఈవారం ఓటీటీలోకి వస్తుందని చాలా మంది భావించారు. శివరాత్రి సందర్భంగా కుటుంబంతో కలిసి సినిమా చూద్దామనుకున్నారు. అయితే ప్రేక్షకులను 'జీ5 ఫిల్మ్' నిరాశపరిచింది. హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ గురించి తమ వద్ద సమాచారం లేదని పరోక్షంగా తెలియజేసింది. దీంతో అసలు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత కరువైంది. ఇక, మార్చి 8, 2024 నుంచి ఓటీటీలోకి వచ్చిన సినిమాల వివరాలు ఇలా ఉన్నాయి..

అమెజాన్ ప్రైమ్:

ఊరు పేరు భైరవకోన (తెలుగు సినిమా) – మార్చి 8

ఆహా:

బ్రీత్ (తెలుగు సినిమా) – మార్చి 8

సౌండ్ పార్టీ (తెలుగు సినిమా) – మార్చి 8

ETV విన్:

వళరి (తెలుగు సినిమా) – మార్చి 6

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:

షోటైమ్ (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 8

హార్ట్ బీట్ (తమిళ వెబ్ సిరీస్) – మార్చి 8

నెట్‌ఫ్లిక్స్‌:

మేరీ క్రిస్మస్ (హిందీ సినిమా) - మార్చి 08

అన్వేషిప్పిన్ కండేతుమ్ (మలయాళ డబ్బింగ్ మూవీ) - మార్చి 08

లాల్ సలామ్ (తమిళ సినిమా) - మార్చి 08

లోన్ అవే (వెబ్ సిరీస్) సీజన్ 4- మార్చి 08

డామ్‌‌సెల్‌ (యాక్షన్‌ థ్రిల్లర్) - మార్చి 08

ది క్వీన్ ఆఫ్ టియర్స్ (కొరియన్ సిరీస్)- మార్చి 09

సోనీ LIV:

మహారాణి S3 (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 7