CRPF's Social Media Rules: రాజకీయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు వద్దు.. బలగాలకు సీఆర్పీఎఫ్ సోషల్ మీడియా ప్రత్యేక మార్గదర్శకాలు
తమ బలగాలకు సోషల్ మీడియాకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. సైబర్ దాడులు, హానీ ట్రాప్, మాల్ వేర్ ఎటాక్స్, పొలిటికల్ ప్రోపగండా వంటి ఉదంతాలు ఇటీవల తరుచూ వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనలు విడుదల చేసింది.
Newdelhi, Jan 20: దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ దళం సీఆర్పీఎఫ్ (CRPF).. తమ బలగాలకు సోషల్ మీడియాకు (Social Media) సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీచేసింది. సైబర్ దాడులు (Cyber Attacks), హానీ ట్రాప్, మాల్ వేర్ ఎటాక్స్, పొలిటికల్ ప్రోపగండా వంటి ఉదంతాలు ఇటీవల తరుచూ వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఈ నిబంధనలు విడుదల చేసింది.
మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి
- వివాదాస్పద వ్యాఖ్యలు చేయకూడదు .
- రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉండాలి.
- ప్రభుత్వాన్ని, భారత సార్వభౌమత్వాన్ని కించపరిచేలా వ్యవహరించకూడదు.
- డ్యూటీ, వ్యక్తిగత అంశాల వెల్లడిపై పరిమితులు ఉండాలి.
నిబంధనలు మీరిన వారిపై సీసీఎస్ కండక్ట్ రూల్స్ 1964 ప్రకారం క్రమశిక్షణ చర్యలు ఉంటాయి.
అమెరికాలో చరిత్ర సృష్టించిన హైదరాబాదీ మహిళ.. మేరీలాండ్ గవర్నర్‌గా అరుణా మిల్లర్