Delhi Shocker: చెల్లింపుల కోసం మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయమని భార్యకు చెప్పిన భర్త.. డౌన్‌లోడింగ్‌లో ఆలస్యం జరుగుతుండటంతో భార్యతో గొడవ.. మధ్యలో కల్పించుకున్న కుమారుడిపై కత్తితో దాడి.. ఢిల్లీలో వెలుగు చూసిన ఘటన

మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ అవడంలో జాప్యం జరుగుతుండటంతో భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి, అడ్డొచ్చిన కొడుకును కత్తితో పొడిచాడు.

Representative Image (File Image)

Newdelhi, June 18: దేశరాజధాని ఢిల్లీలో (Delhi) దారుణం జరిగింది. మొబైల్‌లో (Mobile) యాప్ (App) డౌన్‌లోడ్ (Download) అవడంలో జాప్యం జరుగుతుండటంతో భార్యతో గొడవపడ్డ ఓ వ్యక్తి, అడ్డొచ్చిన కొడుకును కత్తితో పొడిచాడు. అసలు ఏం జరిగిందంటే.. అశోక్ సింగ్(64) ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో సీనియర్ మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఆయన కుమారుడు ఆదిత్య(23) కంప్యూటర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అశోక్ ఇటీవలే గురుగ్రామ్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ క్రమంలో చెల్లింపుల కోసం మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేయాలని భార్యకు చెప్పారు.

RBI Lost Money: ప్రింట్‌ అయినా ఆర్బీఐకి చేరని 88 వేల కోట్ల విలువైన రూ.500 నోట్లు.. ఆర్బీఐ ఏం చెప్పిందంటే?

ఆసుపత్రిలో కొడుకు

కానీ డౌన్‌లోడింగ్‌లో జాప్యం జరుగుతుండటంతో అసహనానికి లోనైన ఆయన భార్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలో తనకు అడ్డుపడ్డ కొడుకును కత్తితో పొడిచేశారు. ఫలితంగా, ఆదిత్యను ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది. గాయాలకు చికిత్స చేసిన అనంతరం వైద్యులు అతడిని డిశ్చార్జ్ చేశారు.

Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా? గుర్తుపట్టలేనంతగా ఎలా మారిపోయారో మీరూ చూడండి!