Devara: దేవర సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా అనుమతి

ఈ సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా... ప్రభుత్వం అంగీకరించింది.

Devara ticket prices hiked in Andhra Pradesh(X)

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'దేవర' చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం కూడా పచ్చజెండా ఊపింది. దేవర సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. టిక్కెట్ ధరల పెంపునకు అనుమతివ్వాలని కోరగా... ప్రభుత్వం అంగీకరించింది.

ఈ నెల 26న అర్ధరాత్రి ఒంటిగంట షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోనికు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి షోకు టిక్కెట్ ధరను రూ.100 మేర పెంచుకోవడానికి అనుమతించింది.

.పుష్ప 2 షూటింగ్‌ లో జానీ మాస్టర్‌ ఆమెను కొట్టాడు.. అల్లు అర్జున్ కు కూడా ఈ విషయం తెలుసు.. నటి మాధవీలత సంచలన కామెంట్స్ (వీడియో) 

మొదటి రోజు వేకువజామున 4 గంటల నుంచి షోలు వేసుకోవడానికి అనుమతించింది. సినిమా విడుదలైన రోజున టిక్కెట్ ధరను రూ.100 పెంచుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 6 వరకు అంటే తొమ్మిది రోజుల పాటు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌లలో రూ.50 పెంచుకోవడానికి అవకాశం కల్పించింది.

ఈ సినిమా స్పెషల్ షోలకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అనుమతించింది. టిక్కెట్ ధరల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పెషల్ షోలకు, టిక్కెట్ ధరల పెంపునకు అవకాశం ఇచ్చింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif